Uppena: మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ నటించిన తొలిచిత్రం ఉప్పెన బాక్సాఫీస్ వద్ద ఎంతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఉప్పెన టీంకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపించారు. అలాగే గిప్ట్స్లతో పాటు ఓలేఖను కూడా పంపారు. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ నిర్మించారు. ఇందులో వైష్ణవ్‌తేజ్ కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా చేసింది. అలాగే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు సంపాదించడంతో పాటు ఈ సినిమాకు ఎంతో హైప్ తీసుకొచ్చారు.
Uppenaఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందానికి చిరంజీవి సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపించిన విషయం తెలిసిందే. ఆ గిఫ్ట్స్‌లో ఓ ప్రేమ జంట ఉన్న బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ ఖరీదు ఏకంగా 83వేల రూపాయలుగా ఉంటుంది. ఈ బొమ్మ పేరు.. స్పెయిన్ సంస్థ లాడ్రో విక్రయిస్తున్న ది థ్రిల్ ఆఫ్ లవ్ కపుల్ ఫిగరైన్ బొమ్మగా సేల్ చేస్తారు. ఇక మెగాస్టార్ గిఫ్ట్స్ పంపిన వారిలో నాక్కూడా అందింది అంటూ డైరెక్టర్ సుకుమార్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కొణిదెల చిరంజీవి, మద్రాసు, ఇండియా అంటూ తాను చిన్నతనంలో అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ఆయన నుంచి ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి కలుగుతోందంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు సుక్కూ. ఇక డైరెక్టర సుకుమార్ ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో పుష్ప చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.