PriyankaNick: బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా గ్లోబల్‌స్టార్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్‌జోనాస్‌ను ఆమె పెళ్లి చేసుకుని అమెరికాలోనే నివాసం ఉంటుంది. ఇటీవలే బాంబేలో ఉన్న తన నివాసాన్ని అమ్మేసింది. పూర్తిగా అమెరికన్ అయిపోయింది ప్రియాంకజోనాస్. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తూ.. మరోవైపు హలీవుడ్లో సినిమాలు, వెబ్‌సిరీస్, టీవీ ప్రొగ్రామ్స్ల్లో చేస్తూ బిజి బిజిగా గడుపుతుంది.
అయితే ఈ PriyankaNickబ్యూటీకి ఇటీవలే కాలంలో హాలీవుడ్లో ప్రేక్షకులనుంచి మంచి గుర్తింపు వస్తుంది. కానీ ఆమెకు మొదటి నుంచి అక్కడి వారు జాత్యంహాకార వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని స్వయాంగా ఆమె రాసిన బుక్‌లో వెల్లడించింది ప్రియాంకనిక్. అందులో ఆమె తెలుపుతూ.. ఒకానొక సమయంలో తనను ఈ దేశం నుంచి వెనక్కి వెళ్లి పోవాలంటూ హెచ్చరించారు. లేకుంటే తన మీద గ్యాంగ్‌రేప్‌కు పాల్పడుతామంటూ హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా తనను వేధించేవారు చాలా మంది ఉన్నారు అంటూ ప్రియాంక రాసిన బుక్‌లో తెలిపింది. ఇక ప్రియాంక చోప్రా తన జీవిత విశేషాలు ఉన్న అన్ ఫినిష్డ్ పుస్తకం అమెరికాలో ప్రస్తుతం బెస్ట్ సెల్లార్గా నిలిచింది. ఇక ప్రస్తుతం PriyankaNickప్రియాంక చోప్రా ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది.