Nani: టాలీవుడ్ నేచురల్‌స్టార్ నాని నేడు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చూద్దాం. నాని పూర్తి పేరు ఘంటా నవీన్‌బాబు. రాంబాబు, విజయ లక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న నాని జన్మించారు. నానికి ఒక అక్క ఉన్నారు. స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం. తొలి నాళ్లలో నాని రేడియో జాకీగా అలరించారు.. కొన్నాళ్లు బాపు, శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో Naniఆయనకు అష్టా చెమ్మా చిత్రంలో ప్రధానపాత్రల్లో నటించే అవకాశం వచ్చింది. దీంతో నాని 2008లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రం నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పటివరకు నాని 25చిత్రాలను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు Naniనటిస్తున్న తాజా చిత్రాలు టక్జగదీశ్, శ్యామ్సింగ్ రాయ్.. ప్రస్తుతం ఈ సినిమాలు సెట్స్ మీదున్నాయి.
చిత్రపరిశ్రమల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు నాని. ప్రేక్షకుల్లో నాని అంటే ప్రత్యేకమైన అభిమానం నెలకొన్న పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు ఈ బర్త్‌డే బాయ్Nani. ఈ రోజు నాని బర్త్‌డే సందర్భంగా.. నిన్న ఆయన నటించిన టక్జగదీశ్ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దాంట్లో నాని ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. దీనికి సంగీతం తమన్ అందించడంతో ఈ సినిమాపై మరింత హైప్ తీసుకుచ్చింది. అంతలాఈ టీజర్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. ఇక శ్యామ్ సింగ్రాయ్తో పాటు అంటే.. సుందరానికీ సినిమా కూడా చేస్తున్నాడు నాని. వైవిధ్యమైన కథలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలపై అందరిలోను ఆసక్తి ఉంది. నేడు Naniనాని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సినీ ప్రేక్షకుల తరపున టీఎప్సీసీ (తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కౌన్సిల్) నేచురల్ స్టార్ నాని గారికి హ్యాపీ బర్త్ డే.