Mohanlal: మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తన కూతురు రాసిన ఓ పుస్తకాన్ని బాలీవుడ్ లెజెండరీ అమితాబ్‌కు పంపించారు. దీంతో బిగ్‌బి తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రమంలో మోహన్‌లాల్ రీట్వీట్ చేశాడు. అసలు ఇంతకీ ఆ పుస్తకం ఏంటీ?.. ట్వీట్స్‌లో విషయాలేంటీ చూద్దాం.. ఇటీవలే Mohanlalమోహన్‌లాల్ కూతురు విస్మయ రాసిన గ్రెయిన్ ఆఫ్ స్టార్‌డస్ట్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే Mohanlalమోహన్‌లాల్ అమితాబ్‌కు ఆ పుస్తకాన్ని పంపించారు. ఈ సందర్భంగా బిగ్‌బి ట్విట్టర్లో స్పందిస్తూ.. మోహన్‌లాల్, సూపర్‌స్టార్ ఆఫ్ మలయాళం. నేను ఎంతో అభిమానించే వ్యక్తి. ఆయన కూతురు విస్మయ రాసిన గ్రెయిన్ ఆఫ్ స్టార్‌డస్ట్‌ను మోహన్‌లాల్ నాకు పంపించారు.
ఊహాజనితంగా రాసిన పుస్తకంలో సృజనాత్మకతతో కూడిన కవితలు, పెయింటింగ్‌తో నిండి ఉంది. పూర్తి కవిత్వంతో ఉన్న ఈ పుస్తకం ఎంతో నచ్చింది. అయినా ఈ ప్రతిభ వారసత్వంతోనే వస్తుంది. మై బెస్ట్ విషెస్ టూ విస్మయ అంటూ ట్వీట్ చేశారు బిగ్‌బి. ఇక బిగ్‌బి ట్వీట్‌పై Mohanlalమోహన్‌లాల్ స్పందిస్తూ.. ఓ తండ్రిగా ఇది గర్వించే సమయం. ఓ లెజెండరి హీరో నుంచి నా కూతురు ప్రశంసలు అందుకుందంటే సాధారణ విషయం కాదు. ఇదంతా మాయలా ఉంది. థ్యాంక్యూ బచ్చన్ సార్ అంటూ ట్వీట్లో తెలిపారు మోహన్‌లాల్. ఇక ఆయన కూతురు విస్మయ రాసిన బుక్‌ను పెంగ్విని ఇండియా సంస్థ ఆధ్వర్యంలో Mohanlalమోహన్‌లాల్ ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు.