ఈ సంక్రాంతికి పోటాపోటిగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో యంగ్ డైనమిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా కాగా, ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని రెడ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీరిద్దరి సినిమాల విషయంపై టాలీవుడ్లో విభేదాలు భగ్గుమంటున్నాయి.. వివరాల్లోకి వెళితే.. హీరో రామ్ పోతినేని తాజా చిత్రం రెడ్ను నిర్మించిన స్రవంతి రవికిషోర్ రామ్‌కు పెదనాన్న. ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా.. కొన్ని ప్రముఖ ఛానెల్స్‌లో అల్లుడు అదుర్స్ సినిమాకు ఇబ్బంది కలిగించేలా కొంతమంది కుట్ర పన్నుతున్నారు. గతంలో సంచలన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుగారు ఆ కొన్ని ఛానెల్స్‌లో యాడ్స్ వేయకుండా బిచ్చగాడు చిత్రాన్ని అఖండ విజయం సాధించడం గుర్తు చేస్తున్నారు.
ఈ సినిమా వందరోజులకు పైగా జెన్యూన్‌గా విత్ అవుట్ డెఫిషిట్ షేర్ల మీద ఆడటం మరిచిపోలేరు. ఇక హీరో బెల్లంకొడ శ్రీనివాస్ హీరోగా వస్తున్న తాజా చిత్రం అల్లుడు అదుర్స్ చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ దర్వకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాను హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, సంచలన నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఈటీవి, ఇతర ఛానెల్స్‌ల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. గతంలో 2019లో వచ్చిన రజనీకాంత్ పేట విషయంలో ఒక ప్రముఖ నిర్మాత మన తెలుగు సినిమాను పక్కన పెట్టి డబ్బింగ్ సినిమాలకు ఎలా ప్రమోషన్స్ చేస్తారని ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిందీ మార్కెట్లోసంచలనం సృష్టించిన రాజమౌళి, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఛత్రపతి చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి పరిచయమవుతున్న యంగ్ డైనమిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, బెల్లంకొండ సురేశ్‌గారికి మరో నిర్మాత యువ హీరో రామ్ పోతినేని పెదనాన్న స్రవంతి రవికిషోర్ గొడవలు, పంచాయితీలు జరిగిన విషయం ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. అలాగే గతంలో బెల్లంకొండ సురేశ్‌గారు.. అల్లుడు అదుర్స్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా సంచలన విజయం సాధించిన కందీరిగ నిర్మించారు. ఆ తర్వాత రభస చిత్రంలో రామ్ అనుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో నిర్మించిన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల తండ్రులు, ఇద్దరి హీరోల మధ్య సంక్రాంతి కోడిపుంజుల పోటీ ఏ పరిణామాలకు దారితీస్తుందోనని సినీ పరిశ్రమ ఆందోళన చెందుతుంది. అయితే స్రవంతి రవికిశోర్ కొంతమందిని పలు ఛానెళ్లను ప్రభావితం చేసి అల్లుడు అదుర్స్ చిత్రానికి ఆ ఛానెల్స్‌ల్లో యాడ్స్ రాకుండా చేయడంతో.. దీనికి మించి కుట్రపూరితమైనది మరోకటిలేదని పరిశ్రమ అభిప్రాయపడుతుంది. గతంలో సంచలన నిర్మాత బెల్లంకొండ సురేశ్ తమిళనాట కంటే ఒకవారం ముందు లారెన్స్ హీరోగా తెరకెక్కిన కాంచన సినిమాను విడుదల చేయడం ఎంతో సంచలన విజయం సాధించింది.. బెల్లంకొండ నిర్మించిన అనేక చిత్రాలు సంచలన విజయం సాధించాయి. సినిమా అంటే పోటీ ఆరోగ్యదాయకంగా వుండాలి.. సంక్రాంతి అంటే ఆరు సినిమాలకు పైగా విడుదల చేయవచ్చు. కానీ పోటీకి భయపడి కుట్రలు చేయడాన్ని సినీ పరిశ్రమ వారు ధర్మో రక్షిత రక్షితః అంటూ బెల్లంకొండ సురేశ్ కుమారుని సినిమా అల్లుడు అదుర్స్‌ను నిర్మించిన ఒక కొత్త నిర్మాత సుబ్రహ్మాణ్యంకు ఇబ్బంది తలపెట్టడం ఏమాత్రం మంచిది కాదని.. ఖచ్ఛితంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా మంచి విజయవంతం కావాలని ఆశిస్తున్నారు.. దీవిస్తున్నారు.