కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన మాస్టర్ సినిమాకు లీకుల దెబ్బ తగిలింది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13 విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మాస్టర్ టీజర్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సంపాదించుకుని రికార్డు సృష్టించింది.
దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో మాస్టర్‌కు షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన ఇంటర్వెల్ సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సీన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎమోషన్ ట్వీట్ చేశాడు.
ఈ సినిమా కోసం చాలామంది సాంకేతిక నిపుణులు, నటీనటులు ఏడాదిన్నరగా కష్టపడ్డారని, దాన్ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుందన్నాడు. ఆన్లైన్లో లీక్ అయిన క్లిప్స్‌ను దయచేసి షేర్ చేయకండి అని కోరిన ఆయన.. థియేటర్స్‌లో చూడండి అని చెప్పారు.