బ్రేకింగ్: సింగర్ సునీత పెళ్లికి డేట్ ఫిక్స్

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రముఖ డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు రామ్ వీరపనేనితో ఇప్పటికే సునీత ఎంగేజ్‌మెంట్ పూర్తవ్వగా.. ఇప్పుడు పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. జనవరి 9న పెళ్లి చేసుకోవాలని వీరిద్దరు నిర్ణయం తీసుకున్నారు. కరోనా క్రమంలో కొంతమంది బంధువుల, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

SUNITHA

అంతకుముందే డిసెంబర్ 26న.. అంటే ఈ రోజు గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ వద్ద రాత్రి 7:30 గంటలకు ఫ్రెండ్స్‌కు సునీత, రామ్‌లు కలిసి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వనున్నారు. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఈ పార్టీలో కాక్టెయిల్స్ మ్యూజిక్‌తో పాటు డ్యాన్స్ ప్రొగ్రామ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక సునీత, రామ్ కలిసి డ్యాన్స్ వేస్తారని తెలుస్తోంది.

గత కొద్దిరోజుల క్రితం రామ్ వీరపనేనితో కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సునీత సోషల్ మీడియాలో వెల్లడించింది. కుటుంబ సభ్యులు, పిల్లల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.