హీరోల కంటే హీరోయిన్స్ సినిమా కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు 50 ఏళ్లు దాటినా సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్స్‌కి పెళ్లైతే చాలు సినిమా కెరియర్ ముగిసిందని చాలామంది దర్శక, నిర్మాతలు అవకాశాలు కూడా ఇవ్వరు. పెళ్లైతే అమ్మ పాత్రలు, చిన్న చిన్న పాత్రలు మాత్రమే వస్తాయి. హీరోలు మాత్రం సినిమా అవకాశాలు వచ్చేంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటారు. దీనిపై చాలామంది హీరోయిన్లు బహిరంగంగా గతంలో విమర్శలు చేశారు.
ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా సీనియర్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 50 సంవత్సరాల సీనియర్ హీరో 19 ఏళ్ల కుర్ర హీరోయిన్ తమ సినిమాల్లో ఉండాలని కోరుకోవడం చాలా దారుణమంది. సినిమా ఇండస్ట్రీలో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉందని, ప్రస్తుత పరిస్థితి కొంచెం మారి హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు వస్తున్నాయంది. తాను హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది తనను దారుణంగా అవమానించారని దియామీర్జా బయటపెట్టింది.
ప్రధాన పాత్రలలో వయస్సు మళ్లిన హీరోలు ఉండటం దురదృష్ణకరమని దియామీర్జా విమర్శలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో వయస్సు పెరుగుతున్నా హీరోలకు అవకాశాలు వస్తున్నాయని, హీరోయిన్లకు మాత్రం అవకాశాలు అసలు రావడం లేదంది. కాగా ప్రస్తుతం నాగార్జున హీరోగా వస్తున్న వైల్డ్ డాగ్ సినిమాలో దియామీర్జా నటిస్తోంది.