ఘనంగా ఎన్టీఆర్ మనవడి నిశ్చితార్థం

యుగ పురుషుడు నందమూరి తారకరామారావు మనవడు, ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా రేఖ గుమ్మడి అనే అమ్మాయితో ఆయన నిశ్చితార్థం జరిగింది. కరోనా ప్రభావం క్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఒక ప్రైవేట్ హోటల్‌లో ఈ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. నందమూరి నటసింహం బాలకృష్ణ దగ్గర ఉండి ఈ నిశ్చితార్థ పనులను చూసుకున్నారు.

nandamuri krishna

బాలకృష్ణ,జయకృష్ణ, మోహన కృష్ణతో పాటు హీరో కాల్యాణ్ రామ్ తన భార్య స్వాతితో కలిసి ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఇక బాలకృష్ణ రెండో కూతురు తేజస్వినితో పాటు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌లో కొత్త లుక్‌లో మోక్షజ్ఞ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

‘ధమ్ ‘ సినిమాతో నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చైతన్య కృష్ణ.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమై బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఇక వధువు రేఖ విజయ వాహిని స్టూడియోస్ అధినేత ఆలూరి చక్రపాణి కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్‌తో విజయ వాహిని స్టూడియోస్ తీసిన చాలా సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. గత 18 ఏళ్లుగా రేఖ కాలిఫోర్నియాలో ఉంటుంది.