‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. జిల్, సుప్రీమ్, జైలవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే లాంటి సినిమాలతో హిట్‌ను అందుకుంది. స్టార్ హీరోల అందరి సరసన అవకాశాలు దక్కించుకుంది. తమిళంలో సినిమాలు చేస్తున్నా.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమా చేస్తూ ఇక్కడే సెటిల్ అయిపోయింది ఈ భామ. హైదరాబాద్‌లో ఇళ్లు కూడా కొనుక్కుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న రాశీఖన్నా.. తాజాగా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
తమ చిన్ననాటి లవ్ ఫెయిల్యూర్ విషయాన్ని తాజాగా బయటపెట్టింది. స్కూల్ డేస్‌లో తన సీనియర్‌తో ప్రేమలో పడ్డానని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఫెయిల్యూర్ అయిందని చెప్పింది. ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నానని, ఇప్పటికైతే తన జీవితంలో ఎవరూ లేరంది. నిజం చెప్పాలంటే ఎవరితోనైనా డేటింగ్ చేయాలి ఉందని తెలిపింది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆస్వాదించాలని ఉందని, కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నానని రాశీఖన్నా చెప్పింది.
ప్రేమ సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని, ప్రేమలో ఫెయిల్యూర్ ఎక్కువంది. అలాంటి చేదు అనుభవం తనకు ఉండటం వల్ల ప్రేమపై మంచి అభిప్రాయం లేదని రాశీఖన్నా చెప్పింది.