మహేష్ హెయిర్ ‌స్ట్రైల్ ఖర్చు ఎంతో తెలుసా?

ప్రిన్స్ మహేష్ బాబు స్టన్నింగ్ లుక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్లకు ఎక్కువ వెళుతుంటాడు. గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎక్కడో ఒకచొటికి వెళుతుంతాడు. తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

maheshbabu hair style

ఇందులో మహేష్ బాబు హెయిర్ స్ట్రైల్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డిఫరెంట్ హెయిర్‌స్ట్రైల్‌తో గాగుల్స్ లుక్‌లో మహేష్ బాబు మరింత యంగ్‌గా కనిపించాడు. ఈ హెయిర్‌స్ట్రైల్‌ను ఫారెన్‌లో మహేష్ చేయించుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఈ హెయిర్‌స్ట్రైల్‌కు రూ.2 లక్షలు ఖర్చు అయిందట.

ఈ లుక్ చూసి మహేష్ ఫ్యాన్స్ సూపర్బ్‌గా ఉందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో మహేష్ నటిస్తున్నాడు.