
విజయ్ ఆంటోని, ప్రీతీ అస్రానీ ప్రధాన పాత్రల్లో ‘నాన్న కుట్టి’ అనే సినిమాని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాణంలో ము. మారన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరించగా రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ చేశారు. సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలను విజయ్ ఆంటోని చేయగా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
తల్లి లేని తన బిడ్డను కానీ అన్ని చూసుకుంటూ ఎంతో ప్రేమతో జాగ్రత్తగా తన కూతురుని ఊటీలో పెంచుకుంటాడు. అతడిని ఆ పాప స్కూల్ టీచర్ ఇష్టపడుతుంది. ఆ టీచర్ అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ అతను తన కూతురు కారణంగా ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. కానీ ఆ పాపకు ఆ టీచర్ అంటే చాలా ఇష్టం. ఇది ఇలా ఉన్న ఉండగా ఆ పాపకు అనుకోకుండా ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. అసలు ఆ సమస్య ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? అతను తన పాపను తాను కాపాడుకోగలుగుతారా లేదా? అసలు ఆ పాప ఎవరు? చివరిగా ఆ టీచర్ను అతను పెళ్లి చేసుకుంటాడా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
అత్యంత ప్రేమగా తన కూతురుని చూసుకునే తండ్రి పాత్రలో విజయ్ ఆంటోని ఈ సినిమాలో జీవించారు. ముఖ్యంగా ఎమోషన్స్ చాలా బాగా పండించారు. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ లా కనిపిస్తూనే మరోవైపు తన కూతురు కోసం ఎంతకైనా తెగించే తండ్రిగా కూడా మెప్పించారు. స్కూల్ టీచర్ పాత్రలో ప్రీతి అస్రాణి చాలా బాగా నటించారు. ఒకపక్క చెప్పుకోవాలని ప్రేమ అలాగే మరోపక్క కేవలం తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో నటిస్తూ యువకుల మనసులను దోచుకున్నారు. పాప పాత్ర చేసిన చిన్నారి అటు నటించడం దగ్గర నుండి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం వరకు, ఎమోషన్స్ నుండి కామెడీ వరకు ప్రతి విషయంలోనూ చాలా బాగా పర్ఫాం చేశారు. అలాగే చిత్రంలో టీ కాఫీ పాత్ర చేసిన వ్యక్తి సినిమా అంతటా నవ్విస్తూ చాలా బాగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే వైజాగ్ లో విజయ్ ఆంటోని స్నేహితుడి పాత్ర చేసిన వ్యక్తి కూడా మంచి కామెడీ టైమింగ్ తో నటించారు. అలాగే చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అందరూ వారి పాత్రలలో నటిస్తూ సినిమాకు మరింత ఎమోషన్ అలాగే ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తూ చిత్రానికి బలాన్ని చేకూర్చారు.
చిత్ర, సాంకేతిక విశ్లేషణ :
ఒక యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని ఒక సెన్సిటివ్ విషయాన్ని అందులో అమర్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది ఒక సాహసం. అటువంటి సాహసాన్ని ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా చూపిస్తూ అందరూ యాక్సెప్ట్ చేసేలా చేయడం ఎంతో క్లిష్టమైన విషయం. సినిమాలో కొన్ని సన్నివేశాలు ముందుగానే అర్థమయిపోతున్నప్పటికీ ఎమోషనల్ గా కనెక్ట్ కావడం వల్ల ప్రేక్షకులు ఎంతో బాగా యాక్సెప్ట్ చేశారు. కాస్త నిదానంగా ఉన్నప్పటికీ కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం. సంగీతం, పాటలు పర్వాలేదు. లొకేషన్స్ తక్కువ అయినప్పటికీ నాచురల్ గా బాగున్నాయి. కలరింగ్, ఎడిటింగ్ వంటి ఇతర సాంకేతిక విషయాలు బాగానే ఉన్నాయి. నిడమానవులు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
దర్శకత్వం, నటీనటుల నటన, ఎమోషన్స్, కామెడీ
మైనస్ పాయింట్స్ :
అర్ధమవుతున్న కొన్ని సన్నివేశాలు, సంగీతం
సారాంశం :
ఫ్యామిలీ ఎమోషన్స్ తో విభిన్నమైన నాన్నకుట్టి సినిమాను కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లో ఎంజాయ్ చేయదగినట్లుగా ఉంది.


