ఇండియన్ 2 సినిమా ఏ క్షణాన మొదలయ్యిందో గాని డైరెక్టర్ శంకర్ ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2.ఓ అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ విషయంలో నిర్మతల నుంచి కండిషన్స్ కూడా ఎదుర్కొంటున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2ని స్టార్ట్ చేయలేమని క్లారిటీ ఇచ్చేసిందట.
దీంతో శంకర్ మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే శంకర్ ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్న ఒక మల్టీస్టారర్ సినిమా కథను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట. ఆ కథలో ఒక హీరోగా ముందే విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసుకున్నారు. ఇక మరో హీరోగా KGF స్టార్ యష్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే మరో ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్ నుంచి ఒక హీరోను ఫైనల్ చేసినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.