టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో RRR సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాలోని రాంచరణ్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ఇది రికార్డు నమోదు చేసింది. విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించారు. ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్‌తో అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేశాడు. దీనికి సినీ ప్రేమికుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
రాజమౌళి ఫ్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నాడు. చెర్రీ సరసన బాలీవుడ్ నటి ఆలియా నటిస్తుండగా.. తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఇటీవల విడుదల చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.