“మాయలేడి ” చిత్ర రివ్యూ

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశంకర్ రచన దర్శకత్వంలో రాకేష్ వర్రె హీరోగా స్వీయ నిర్మాతగా వ్యవహరిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాయలేడి. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఇంద్రజ, సత్య, లావణ్య రెడ్డి, వినోద్ కిషన్, మైసూర్ సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ చేశారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
పెళ్లి వయసుకు వచ్చిన యువకుడు పెళ్లి చేసుకోకుండా తాను ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తనకంటూ ఒక క్లారిటీతో అందరికీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పుతూ జీవనం సాగిస్తాడు. తనతో పాటు తన స్నేహితుడు అలాగే తన స్నేహితుని భార్య కూడా పనిచేస్తారు. ఇది ఇలా ఉండగా అతను ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కానీ ఆ అమ్మాయి కవలలు కావడంతో ఆ విషయం తెలియక తనకు తెలియకుండానే ఇద్దరికీ దగ్గరవుతాడు. ఇది ఇలా ఉండగా ఆ కవలలు ఇద్దరు కాస్త భిన్నంగా ఉండటంతో అతనికి అనుమానం వస్తుంది. చివరికి వారు గురించి తెలుసుకున్న వ్యక్తి అసలు వారిలో ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అసలు పెళ్లి చేసుకుంటారా లేదా? ఆ కవలలకు ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్య నుండి బయట పడతారా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ సినిమాలో హీరోగా నటించిన రాకేష్ వర్రె(క్రిష్) గతంలో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే ఎవరికీ చెప్పొద్దు, జితేందర్ రెడ్డి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. ఈ సినిమాలో ఒక వైపు లవర్ బాయ్ గా కనిపిస్తూనే మరోవైపు యాక్షన్ తో అదరకొట్టేశారు. ప్రత్యేకంగా యాక్షన్ సీన్స్ లో ఆయన పర్ఫామెన్స్ పీక్స్ అనిపించింది. మధుమిత సర్కార్ (ఆశ, రూప) పాత్ర సినిమాలో రెండు పాత్రల్లోనూ చాలా బాగా నటించింది. ఒక పాత్ర ఐస్ లా కూల్ గా ఉంటే మరొక పాత్ర ఫైర్. రెండు విభిన్న పాత్రలోనూ ఆమె బాగా మెప్పించారు. సత్య పాత్ర ఈ సినిమాలో కూడా ప్రేక్షకులను నవ్విస్తూ చాలా బాగా అనిపించింది. ఇంద్రజ, లావణ్య రెడ్డి పాత్రలు బాగానే ఉన్నాయి. సినిమాలో నటించించ ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్లు బాగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
చాలా సాధారణ కథను విభిన్న మలుపులతో ప్రేక్షకులను అత్యంత అధికంగా ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ అలాగే ఆలోచింపజేయడంలో దర్శకుడు ప్రశంకర్ సక్సెస్ అయ్యారు. పాటలు, బిజిఎం బాగున్నాయి. సినిమాలో హాస్యం, యాక్షన్ చాలా బాగా పండింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో లొకేషన్స్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించాయి. సినిమా సాధారణంగానే ఉన్నప్పటికీ సినిమాలోని మలుపులు చాలా బావున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, కథలోని మలుపులు, నటీనటుల నటన, హాస్యం, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు, పాటలు

సారాంశం :
కుటుంబసమేతంగా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ తో ట్విస్టులతో నవ్వుకుంటూ చూడవలసిన చిత్రం మాయలేడి.

Related Articles

Latest Articles