రాఘవ లారెన్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో మల్టిటాలెంటెడ్ టెక్నీషియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్న విషయం తెలిసిందే. అలాగే మంచి వ్యక్తిత్వం గల మనిషి కూడా. నటన, దర్శకత్వం, కొరియోగ్రాఫింగ్ గా మెప్పిస్తునే ఇతరులకు సహాయం కూడా చేస్తుంటాడు. కెరీర్ లో అతను పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ రోజు (అక్టోబర్ 29) తన పుట్టినరోజు సందర్భంగా, జి.వి.ప్రకాష్ సంగీతంతో అతని తదుపరి సినిమా రుద్రన్ ని ప్రకటించాడు. ఈ చిత్రం 2021లో విడుదల కానుందట. ఈ సినిమాను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ కాతిరేసన్ ఎల్ఎల్పి సమర్పిస్తోంది. ఇక రాఘవ లారెన్స్ యొక్క తొలి హిందీ చిత్రం, లక్ష్మీ బాంబ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ-హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక సినిమాపై కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.