టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ పైరసీ భూతం కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో చాలానే అప్గ్రేడ్ అయ్యింది. ఇక అందులో అగ్ర రాకాసిగా కొనసాగుతోంది మాత్రం తమిళ్ రాకర్స్ అనే చెప్పాలి. ఈ పేరుతో వచ్చే వెబ్ సైట్లలో క్షణాల్లో విడుదలైన సినిమాలు దర్శనమిస్తుంటాయి. ఇక డిజిటల్ వరల్డ్ లో విడుదలయ్యే సినిమాలు కూడా అక్కడ ఒరిజినల్ ప్రింట్లతో దర్శనమిస్తుంటాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ పైరసీ బుతాన్ని అంతమొందించడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ICANN) రిజిస్ట్రీ ద్వారా ఆ సైట్‌ను తొలగించారట.
తాజాగా అమెజాన్ ఇంటర్నేషనల్ సంస్థ తమిళ్ రాకర్స్‌కు వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు చేయడంతో డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం ప్రకారం తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ కి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. ఈ వార్తపై తమిళ సెలబ్రెటీలతో పాటు స్టార్ హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం అది మళ్ళీ తిరిగొస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.