మలయాళం స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కోవిడ్ భారిన పడ్డాడు. నటుడిగానే కాకుండా లూసిఫర్ సినిమాతో దర్శకుడిగా కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకున్న పృథ్వి నెక్స్ట్ జన గణ మన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇటీవల సినిమా షూటింగ్ లో సెట్స్ నుండి వైరస్ సోకినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన పృథ్వి ఈ విధంగా పేర్కోన్నారు. అక్టోబర్ 7 నుండి డిజో జోస్ ఆంటోనీ యొక్క “జన గణ మన” చిత్రీకరణలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే షూటింగ్ నిర్వహించాము. షెడ్యూల్ ప్రారంభమయ్యే ముందు షూట్లో పాల్గొన్న వారందరినీ పరీక్షించారు మరియు మేము ఏర్పాటు చేసిన కోర్టు గది సెట్లో షూట్ చివరి రోజు, పరీక్షలు పునరావృతమయ్యాయి. దురదృష్టవశాత్తు, ఈసారి పరీక్ష ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ఇక నేను వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లి నా తోటి వారిని కూడా అలెర్ట్ అయ్యేలా చేశాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. త్వరలో కోలుకొని తిరిగి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.