
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సిరి వరాహ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న ‘విభ్రమ’ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్వయంభూ కాలభైరవ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాల నడుమ ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సభ్యులు పాల్గొని సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్. రాకీ రజనీకాంత్ దర్శకత్వంలో, నరేంద్ర దేనుక నిర్మాతగా, ఎస్. శిరీష రాకీ సహ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో టైగర్ నరేష్, సిద్ధార్థ్ రాయ్, చంద్రకళ చిన్ని, అను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
దసరా పర్వదినాన శుభారంభం చేసుకున్న ‘విభ్రమ’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది.
సినిమా పేరు: విభ్రమ
ప్రధాన పాత్రధారులు: టైగర్ నరేష్, సిద్ధార్థ్ రాయ్, చంద్రకళ చిన్ని, అను
నిర్మాణ సంస్థ: సిరి వరాహ ఫిల్మ్స్
దర్శకుడు: ఎస్. రాకీ రజనీకాంత్
నిర్మాత: నరేంద్ర దేనుక
సహ నిర్మాత: ఎస్. శిరీష రాకీ
PR & డిజిటల్ : కలర్ఫుల్ డిజిటల్ మీడియా


