కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ అనసూయ

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా తనకంటూ అలా ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అనసూయ భరద్వాజ్ ఎలాంటి ఫొటో షేర్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇక అప్పుడప్పుడు సామాజిక అంశాలపై అనసూయ స్పందించే విధానం కూడా వైరల్ అవుతుంటుంది. రీసెంట్ గా ఆమె తొమ్మిదేళ్ల కుమారుడన్న మాటలకు అనసూయ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుందట.

ప్రస్తుతం వర్షాల ధాటికి హైదరాబాద్ నగరంలో వరదలు ముంచెత్తడం అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో వరదలు తీవ్ర ప్రభావం చూపడంతో తన కొడుకు మాటలు తనను కదిలించాయని అనసూయ తెలిపింది. అమ్మా నేను గతంలోకి వెళ్లాలని అనుకుంటున్నా. ఎందుకంటే కరోనా వరదలు లేని ఆ సమయంలో ఎంతో హ్యాపీగా ఉన్నాం.. అంటూ కుమారుడన్న మాటలకు ఏడ్చేశానని చెప్పిన అనసూయ నిజానికి మనం ఎలాంటి పరిస్థితులు కొనితెచ్చుకున్నాం? భవిష్యత్తు తారలకు ఏం అందించనున్నాం.. అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసింది.