పెళ్లి తరువాత మొదటిసారి హనీమూన్ లో రానా మిహికా

రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న తరువత లాక్ డౌన్ లో మ్యారేజ్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేశారు. ఇక హనీమూన్ కి భరిగానే ప్లాన్ వేసుకున్నప్పటికి కాస్త ఆలస్యమయ్యిందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఒక రొమాంటిక్ ఫొటోతో ఈ జంట హనీమూన్ డేస్ ని స్టార్ట్ చేసినట్లు ఈజీగా అర్ధమయ్యింది.

ఆగస్టులో వివాహం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు మరోసారి ఈ హనీమూన్ ఫొటోతో హాట్ టాపిక్ గా మారింది. రానా స్లీవ్ లెస్ టీ షర్టులో కనిపించగా, మిహీక డెనిమ్స్‌తో ఫ్లవర్ టాప్ ధరించింది. చిత్రంలో విభిన్న రకాల షేడ్స్ ఉపయోగించారనిపిస్తోంది. ఇక బజాజ్ అందుకు తగ్గట్టుగా స్మైల్ ఇచ్చారు. వారి పెళ్లి తర్వాత మిహీకా రానాతో కలిసి ఒక చిత్రాన్ని పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. రానా మరియు మిహీక హనీమూన్ ఎక్కడ ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆగస్టు 10 న హైదరాబాద్‌లో రానా, మిహీకా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. COVID-19 పరిమితుల కారణంగా అతని వివాహానికి 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ జంట మే 21న (లాక్డౌన్ సమయంలో) నిశ్చితార్థం చేసుకున్నారు.