యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచిన ‘రాయవలస’ చిత్రంలోని ‘రింగుడు రింగుడు’ పాట

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయవలస’. ఈ చిత్రంలో కార్తీక్ జయంతి, శ్రేషా నులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమెరికా నుంచి కార్తీక్ జయంతి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ‘రాయవలస’తో కార్తీక్ జయంతి తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతోన్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న శ్రీషా నులు, ‘రాణి’ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. తన సహజమైన నటన, హుందాతనంతో రాణి పాత్రకు ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి రాధిక జయంతి అమెరికా నుంచి భారత్‌కు వచ్చారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది.

కార్తీక్ తన సొంత సంగీత ఛానల్ రేసన్ రికార్డ్స్ కూడా ప్రారంభించారు. నిర్మాత వంశీ నందిపాటి గారు ఈ ఛానల్‌ను ప్రారంభించారు. సంగీతానికి, కొత్త ప్రతిభావంతులకు వేదిక కల్పించడం ఈ ఛానల్ లక్ష్యం. గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘రాయవలస’ రూపొందింది. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారు.

ఈ చిత్రానికి అర్జున్ బాల మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ పాటలకు సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి పాటలు పాడారు. ఈ సినిమాకి వి.ఆర్.కె. నాయుడు (కిట్టు) కెమెరామెన్‌గా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. సినిమా కి సంబంధించిన రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్న చిత్ర బృందం.

నటీనటులు

కార్తీక్ జయంతి, శ్రీషా నులు, అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధరావు, కంచరపాలెం రాజు, సుహాసన్, వివేక్ వర్ధన్, మృదుల, గాంధీ, లక్ష్మణ్, లండన్ తదితరులు

సాంకేతిక బృందం

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి
నిర్మాత: గోపీ కృష్ణ జె
కథ, మాటలు: రాఖీ ఏ
సంగీతం: అర్జున్ బాల
ఛాయాగ్రహణం: వి.ఆర్.కె. నాయుడు (కిట్టు)
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్.
ఫైట్స్: మల్లేష్ షాలియన్
కొరియోగ్రఫీ: రాజ్ పైడే
కాస్ట్యూమ్ డిజైనర్లు: రూప, కిరణ్
ప్రొడక్షన్ డిజైనర్: సాయి
పీఅర్ఓ: సాయి సతీష్

Related Articles

Latest Articles