అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమ్ కానున్న ‘ఆశ’

ప్రముఖ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఆశ’. అక్టోబ‌ర్ 16 నుంచి డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. డెబ్యూ డైరెక్ట‌ర్‌ సఫర్ సనల్ దర్శకత్వంలో వినాయక అజిత్ నిర్మించిన ఈ చిత్రంలో జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్, లక్ష్మీ మీనన్, భాగ్యలక్ష్మి, అజయన్ ఆదత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 16 నుంచి మలయాళ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మాతృత్వం, నైతిక విలువలు, చిన్న చిన్న నిర్ణయాలు ఊహించని పరిణామాలకు ఎలా దారితీస్తాయనే అంశాలను ఆసక్తికరంగా ఆవిష్కరించే ఈ థ్రిల్లర్.. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లలోనూ ప్రేక్షకులను మెప్పించ‌నుంది.

‘ఆశ’ కథ విషయానికి వస్తే.. సాధారణ జీవితం గడిపే ఓ మహిళ జీవితంలో రోడ్డు ప్రమాదం అనూహ్యమైన మలుపు తీసుకొస్తుంది. ఈ ఘటన ఆమెను జీమన్ (జోజు జార్జ్)తో గొడవకు దారితీసే పరిస్థితుల్లోకి నెడుతుంది. భర్తను కోల్పోయి, తన కుమార్తెలే ప్రపంచంగా జీవించే ఆశ.. గతంలో ఎదుర్కొన్న అనుభవాలు, భయాల మధ్య తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తపిస్తుంటుంది. చిన్న ఘ‌ట‌న‌తో మొద‌లైన వాగ్వాదం.. క్రమంగా అందరి జీవితాలను మార్చేసే పరిణామాలకు దారితీస్తుంది. తమ నిర్ణయాల పర్యవసానాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న కొద్దీ.. భయం, ఆత్మగౌరవం, కోపం, ఆత్మీయులను కాపాడుకోవాలనే తపన మధ్య మనుషులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారనే అంశాలను ఈ చిత్రంలో ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు.

“AASHA” | Offical Trailer | Malayalam Zee5 | Urvashi, Joju George, Aishwarya Lekshmi | Pre 16th Oct – https://youtu.be/EYSBA1cwBes

‘ఆశ’ చిత్రంలో ఏ పాత్రను పూర్తిగా మంచిదని, మరొక పాత్రను చెడ్డదని తేల్చకుండా కథను నడిపించిన విధానం. ఒక వ్యక్తి చేసిన పనిని.. దానికి దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోకుండా సరైనదా, తప్పా అని నిర్ణయించగలమా? అనే ప్రశ్నను ఈ సినిమా ప్రేక్షకుల ముందుంచుతుంది. చిన్న చిన్న నిర్ణయాలు ఊహించని పరిణామాలకు ఎలా దారితీస్తాయనే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం సాగుతుంది. ఓ సాధారణ తల్లి అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఆలోచనతో ‘ఆశ’ కథ మొదల‌వుతుంద‌ని.. సాధారణ ప్రతీకార కథల తరహాలో కాకుండా.. పాత్రలు, వాటి నిర్ణయాలు, వాటి పర్యవసానాల చుట్టూ కథను ఆసక్తికరంగా మలిచినట్లు ఆయన పేర్కొన్నారు.

మలయాళం, తమిళం, తెలుగు విభాగాల బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ.. “మలయాళం జీ5లో మా లక్ష్యం కేవలం విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావట‌మే కాదు. ప్రముఖ ఓటీటీ వేదికగా, ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని ప్రశ్నించే, విభిన్నమైన కథా కథనంతో మెప్పించే చిత్రాలకు మద్దతుగా నిలవాలని మేం విశ్వసిస్తున్నాం. కళాత్మక లోతు, భావోద్వేగాల పరంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందాల్సిన సినిమాలను ప్రోత్సహించేందుకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం” అని అన్నారు.

“‘ఆశ’ మా ఆలోచనా విధానానికి అద్దం పట్టే సినిమా. సినిమా పూర్తైన‌ తర్వాత కూడా ప్రేక్షకుల మనసుల్లో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తూ గుర్తుండిపోతుంది. ఇందులో ఏం ఆలోచించాలో ప్రేక్షకులకు చెప్పకుండా.. పాత్రల గురించి తమకున్న అభిప్రాయాలను, ఆలోచనలను మరోసారి ప్రశ్నించుకునేలా చేస్తుంది. సఫర్ సనల్ ప్రతి నిర్ణయానికి ఓ పర్యవసానం ఉంటుందనే విషయాన్ని చూపిస్తూ.. మంచి, చెడుల మధ్య సరిహద్దులు చెరిగిపోయేలా కథను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు.

లెజెండరీ నటి ఊర్వశి తన అద్భుతమైన నటనతో ఆశ పాత్ర‌లో అసాధార‌ణంగా న‌టించారు. ఆ పాత్రలోని బలహీనతలు, ధైర్యం, అంతర్గత సంఘర్షణలను ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ఇలాంటి వైవిధ్యమైన, ఆలోచింపజేసే మలయాళ చిత్రాన్ని అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా జీ5 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు భావోద్వేగపరంగానూ, మానసికంగానూ ఓ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం” అని లాయిడ్ సి. జేవియర్ తెలిపారు.

క‌న్న వారిని కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంతవరకు వెళ్లగలదు? ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో మలుపులతో సాగే ‘ఆశ’ కథలోని నిజాలను తెలుసుకోవాలంటే.. అక్టోబర్ 16 నుంచి మలయాళం జీ5లో చూడండి

Related Articles

Latest Articles