అక్టోబర్ 16 నుంచి హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న DC

కొన్ని కథలు ప్రేమ‌తో ప్రారంభ‌మైతే.. నమ్మకద్రోహంతో మరికొన్ని అనుకోని మలుపు తిరుగుతాయి. ఎటూ తోచని పరిస్థితుల్లో మనుషులు తీసుకునే నిర్ణయాలు ఇంకొన్ని కథలకు కారణమవుతుంటాయి. అధికారం, నమ్మకం, ప్రతీకారం మధ్య సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అరుణ్ మాథేశ్వరన్ హిట్ మూవీ ‘DC’ అక్టోబర్ 16 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

‘DC’ కథ విషయానికి వస్తే.. తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకుని జీవించే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే దేవదాస్ అలియాస్ దాస్ (లోకేశ్ కనగరాజ్) జీవితంలోకి గాయని పార్వతి అడుగుపెట్టడంతో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మరోవైపు పరిస్థితులకు ఎదురొడ్డి తన జీవితాన్ని ముందుకు నడిపించేందుకు చంద్ర (వామికా గబ్బి) ప్రయత్నిస్తుంటుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానితో ఒకటి ముడిపడటంతో ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది.

అరుణ్ మాథేశ్వరన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంజన కృష్ణమూర్తి, కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్ తదితరులు ఇత‌ర కీలక పాత్రల్లో నటించారు.

‘DC’ అక్టోబర్ 16 నుంచి సోనీ లివ్‌లో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Related Articles

Latest Articles