2001లో నువ్వు నేను సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనిత. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఉదయ్ కిరణ్ – అనిత నటనకు అప్పట్లో మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత వారి కాంబినేషన్ లోనే శ్రీరామ్ సినిమా కూడా వచ్చింది. ఇక చాలా రోజుల తరువాత అనిత ఒక గుడ్ న్యూస్ తో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆమె మొదటిసారి తల్లి కాబోతోంది. అందుకు సంబంధించిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది
ఏడేళ్ల క్రితం రోహిత్ రెడ్డి అనే బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకున్న అనిత సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది. ఎక్కువగా సీరియల్స్ లలో నటిస్తోంది. అలాగే అప్పుడప్పుడు పలు రియాలిటీ షోలతో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న అనిత రీసెంట్ గా ప్రెగ్నెన్సీ గురించి వివరణ ఇచ్చింది. త్వరలోనే మా సంఖ్య మూడు కాబోతోంది అంటూ మా ప్రపంచంలో చాలా మార్పులు రాబోతున్నాయని తెలిపింది. మొదట ఆమె డేటింగ్ చేస్తున్నప్పటి ఫుటేజ్ నుంచి ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఫుటేజ్ వరకు ఒక స్పెషల్ వీడియోను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది