కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత మొదటిసారి కలుసుకున్న లవ్‌బర్డ్స్‌

అర్జున్ కపూర్ మలైకా అరోరా గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజా తరువాత వీరిద్దరు ఒక చోట దర్శనమిచ్చారు. కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత ఇద్దరూ మొదటిసారిగా బహిరంగంగా కనిపించడంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వారాల క్రితం మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక కరోనా తగ్గిన తరువాత మళ్ళీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల మలైకాను అర్జున్ ఆమె ఇంటివద్ద డ్రాప్ చేశాడు. ఇద్దరు పర్సనల్ గా ఒక ప్రయివేట్ పార్టీ కూడా చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. వారికి సంబంధించిన ఫొటోలు కూడా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరి పెళ్లిపై కూడా గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కరోనా లేకపోయి ఉంటే ఈ సారి ఏడాడుగులు వేసేవారట. ఇక మ్యారేజ్ ప్లాన్ ని ఈ స్టార్స్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.