ఎన్ఎస్ఆర్ ఎస్టేట్ సంస్థ విడుదల చేసిన ‘మునుపటి కన్నా వేగంగా’ పాటను ఆ సంస్థ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించగా హేమచంద్ర పాడడం జరిగింది. ఈ సాంగ్ లో సైబర్ పోలీస్ కమిషనర్ సర్జనర్, సన్ షైన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ గురువా రెడ్డి, సిటీ న్యూరో హాస్పిటల్ ఎండి డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి, వైస్ ఛాన్సలర్, వైఎస్ఆర్ అర్చిటేక్చరల్ యూనివర్సిటీ విజయ్ కిషోర్, ప్రెసిడెంట్ తెలంగాణ డెవలోపేర్స్ అసోసియేషన్ సివి.రావ్, కూచిపూడి డాన్సర్ కోట విజయ లక్ష్మి, ఒతమాలజిస్ట్ డాక్టర్ స్వరూప్, డాక్టర్ సుమన్ సయని, అర్బన్ ప్లానర్ ఎండి అడాప్ట్ టెక్నాలజీస్ మహిప్ సింగ్ తాపర్, నిర్మాత రాజ్ కందుకూరి, నటుడు శివ కందుకూరి, నటి మెహరిన్ కౌర్ ఈ పాటలో పాటిస్పెషన్ చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…
మానవుడు చరిత్రలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నాడు. ఈ కరోనా అనేది చరిత్రలోనే మరో జాతీయ విపత్తుగా చెప్పుకోవచ్చు. ఎన్ని విపత్తులు వచ్చినా మానవుడు ఎప్పుడూ ఓడిపోలేదు. అదే స్ఫూర్తితో ప్రతిదాన్ని జాయిస్తూ వస్తున్నాడు మానవుడు. ఈ కరోనా మహమ్మారిని కూడా మనం తెలివిగా జయిస్తూ వస్తూ ఉన్నాము, దీనినుండి మనం బయటపడతామని నమ్మకం నాకు ఉంది. నా భావాలను పంచుకొని ఒక పాట రాయవలసిందిగా ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ గారిని కోరడం జరిగింది. నా భావాలను వారు ఒక పాట రూపంలో చక్కగా అందించారు. అలాగే యువగాయకుడు హేమచంద్ర అద్భుతంగా పాడాడు, అలాగే శ్రీచరన్ పాకాల రోమాలు నిక్కపొడుచుకొనెల ఆ పాటకు సంగీతం అంచించాడు. ఈ పాటకు దర్శకుడు సచింద్ర చక్కటి వీడియో అందించారు. దీనికి ప్రపంచంలో ఉన్న తెలుగువారు మా సంస్థ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు సేవలు అంచిందిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎవరిలో అయితే ఆత్మ విశ్వాసం సన్నగిల్లిందో వారందరికీ ఈ పాట చేరేలా వారిలో స్ఫూర్తి నింపడానికి అందరూ కృషి చేస్తారని భావిస్తున్నాను. ఈ పాటను తమ సేవల ద్వారా విజయాన్ని సాధించడానికి ఉపయోగ పడ్డారో వారందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నాము.