ఎస్ఎస్ రాజమౌలి శనివారం తన 47 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి నుండి సోషల్ మీడియాలో ఈ దర్శకుడికి భారీ స్థాయిలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, రాజమౌలి దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫాంటసీ యాక్షన్ చిత్రాలతోనే ఆయన క్రేజ్ ఎక్కువగా పెరిగింది.
టెలివిజన్ సీరియల్ ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన రాజమౌళి మొదటి చిత్రం , జూనియర్ ఎన్టిఆర్ నటించిన స్టూడెంట్ నెం 1.
అప్పటి నుండి, ఎస్.ఎస్.రాజమౌళి తన నైపుణ్యాన్ని మరింత పెంచుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నారు. బాహుబలి అనంతరం జక్కన్న స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ గురించి కల్పిత కథను రెడీ చేసుకొని RRRతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన తండ్రి కె.వి.విజయేంద్ర ప్రసాద్ యొక్క మార్గదర్శకత్వంతో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రభాస్, అనుష్క, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని వంటి హీరోలకు మంచి బూస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా ప్రభాస్ తో మొదట ఛత్రపతి సినిమాతో హిట్ కొట్టి ఆ తరువాత బాహుబలితో మరో స్థాయికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.