“అనకాపల్లి” చిత్ర రివ్యూ

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించగా మెహబూబ్ భాషా, ఇంద్రజ, శ్రీనివాస్ వడ్లమని తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించగా కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించారు. మాయ వి సినిమాటోగ్రఫీ చేయగా డావ్జాండ్ సంగీతాన్ని అందించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
అనకాపల్లిలోని ఒక సాధారణ మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలోని ఒక యువకుడు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంటాడు. అటువంటి యువకుడు అదే ఊరిలో ఒక రౌడీని చూసి స్పూర్తిగా తీసుకుని కొన్ని అసాంఘిక చర్యలకు పాల్పడతాడు. అదే వృత్తిలో వారికి పోటీగా వేరే వారితో, పోలీస్, రాజకీయనాయకులతో పోరు ఉంటుంది. అదే సమయంలో అతను ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. చివరికి తన తల్లిదండ్రుల మాట విని మారతాడా లేదా? అతడిని ఆ అమ్మాయి ఇష్టపడుతుందా? చిన్న వయసులోనే అటువంటి వృత్తిలోకి వెళ్లిన ఆ యువకుడు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? అతనికి పోలీస్, రాజకీయ వ్యవస్థుల నుండి వచ్చిన అడ్డంకులు ఏంటి? చివరికి అలా చేయడం వల్ల అతని జీవితం ఎలా మారుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ఒకరికి ఒకరు పోటీగా నటించారు. విక్రమ్ సహిదేవ్ ఒక కాలేజీ విద్యార్ధి వయసు తర్వాత కనిపించే మిడిల్ క్లాస్ అబ్బాయి నుండి గుర్తింపు కోసం రిస్క్ లు చేసే తన పాత్రలో ఒక ఫేస్ నుండి మరొక ఫేస్ లోకి మారినట్లు బాగా నటించారు. సంధ్యా వశిష్ట ఒక టౌన్ స్టూడెంట్ పాత్రలో బాగా నటించారు. గతంలో శ్రీ చిదంబరం సినిమాలో ఎలా కనిపించారో సుమారుగా అలాగే కనిపిస్తూ తన పత్రకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా నటించారు. తారక్ పొన్నప్ప ఎన్నో చిత్రాలలో ఎక్కువగా నెగెటివ్ పాత్రలలో కనిపించినట్లు ఈ సినిమాలో కూడా అలాగే కొంచం రా & రస్టిక్ గా కనిపించారు. ఆయన నటన ఈ సినిమాలో పూర్తిగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో నటులుగా పరిచయం అయిన నక్కిన త్రినాథరావు, కాండ్రేగుల నాయుడు తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ వారి పాత్రలకు న్యాయం చేశారు. స్నేహితుడి పాత్రలో మెహబూబ్ భాషా, తల్లి పాత్రలో ఇంద్రజ అలాగే మరొక కీలక పాత్రలో శ్రీనివాస్ వడ్లమని చాలా బాగా నటించారు. సినిమాలో కనిపించిన ఇతర నటీనటులు తమ తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ కనిపించారు.

సాంకేతిక విశ్లేషణ :
అనుకున్న కథను వెండి తెరపై చూపించడంలో దర్శకుడు కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. సంగీతం, పాటలు బావున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. లొకేషన్స్ అన్ని చాలా న్యాచురల్ గా అనిపించాయి. స్క్రీన్ ప్లే అస్త స్లోగా అనిపించింది కాని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, సంగీతం, పాటలు

మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే

సారాంశం :
ఒక టౌన్ లో జరిగే కథగా అందరి పాత్రలను కొంత ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అనకాపల్లి.

Related Articles

Latest Articles