
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తత్వం’. త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. చేతన భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి విప్లవ్ నైషదం ఎడిటింగ్ చేయగా భరత్ పట్టి సినిమాటోగ్రఫీ చేశారు. భోగిరెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని, ఆనంద్ భారతి, కృష్ణ సుక్కు తదితరులు కీలకపాత్రలు పోషించారు. నేడు విడుదలైన ఈ చిత్రానికి విషయానికి వస్తే…
కథ :
ఎస్సై కావాలనుకుంటున్న మధ్యతరగతి కుటుంబ యువకుడు దినేష్ తేజ్ కానిస్టేబుల్ గా కష్టపడుతూనే ఎస్సై పరీక్షలకు సిద్ధమవుతుంటాడు. సజావుగా సాగుతున్న తను పెళ్లిచూపుల కోసం మరొక గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో అనుకోకుండా జరిగిన జంట హత్యలు కేసు తాను ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతారు. చనిపోయిన వారికి మానసిక పరిస్థితి బాగోని ఒక కొడుకు. గ్రామస్తులంతా అతనిపై అనుమానం వ్యక్తం చేస్తుండగా దినేష్ తేజ్ మాత్రం పూర్తిగా మరొక కోణంలో దర్యాప్తు చేస్తుంటారు. అసలు వారిని చంపింది మానసిక పరిస్థితి బాగోని వారి కొడుకా లేదా ఇంకొకరా? వాడి చావుకి కారణం ఏంటి? చివరికి ఆ కేసు అంతు చిక్కుతుందా లేదా? ఆ గ్రామానికి పెళ్లి చూపుల కోసం వెళ్లిన విషయం ఏమైంది? వారు ఒకరికి ఒకరు ఇష్టపడతారా లేదా? అని అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటినటుల నటన :
కానిస్టేబుల్ పాత్ర దినేష్ తేజ్ చాలా బాగా పోషించారు. ముఖ్యంగా పోలీసులకు కనిపించే పర్సనాలిటీ అతనికి బాగా సూట్ అయింది. అంతేగాక యాక్షన్, డైలాగులు నిలబడి నుండి ప్రతి విషయంలోనూ గతంలో తాను చేసిన సినిమాలకు కాస్త భిన్నంగా కనిపిస్తూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. హీరోయిన్ గా నటించిన దష్విక పల్లెటూరి అమ్మాయిలాగా కనిపిస్తూ తన పాత్రకు తగ్గట్లు నటించారు. హీరో స్నేహితుడు పాత్ర పోషించిన వ్యక్తి కూడా బాగా నటించారు. పల్లెటూరిలో పనివాడిగా నటించిన వ్యక్తి కామెడీని బాగా పండిస్తూ సినిమాలో కాస్త ఫన్ యాడ్ చేశారు. ముఖ్యంగా మానసిక వికలాంగుడుగా కనిపించిన యువకుడు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నటించాడు. భోగిరెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని, ఆనంద్ భారతి, కృష్ణ సుక్కు వారి పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బలాన్ని చేకూర్చారు. అలాగే ఇతర నటీనటులు బాగానే నటించారు.
సాంకేతిక విశ్లేషణ :
ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కథ. పల్లెటూరి నేపథ్యంలో ఇటువంటి థ్రిల్లింగ్ క్రైమ్ కథ చెప్పడం కాస్త క్లిష్టమైన విషయం అయినప్పటికీ దర్శకుడు ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా వెండితెరపై చిత్రాన్ని చూపించడంలో విజయం సాధించరని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే అంతంత మాత్రమే ఉన్నప్పటికీ తాను అనుకున్న కథను బాగానే చూపించారు. అదికూడా నాచురల్ లొకేషన్స్ కావడంతో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా వచ్చింది. సినిమాలోని అన్ని లొకేషన్స్ చాలా న్యాచురల్ గా అనిపించాయి, దానితో కథ మనకు బాగా తెలిసిన ఊరిలో జరిగినట్టు ఉంటుంది. పాటలు బాగున్నాయి. సినిమా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలలో కాస్త నిదానంగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. కలరింగ్ వంటి ఇతర సాంకేతిక విషయాలు, నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, పాటలు, ట్విస్టులు, లొకేషన్స్.
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు.
సారాంశం :
క్రైమ్ ట్రైలర్స్ ఇష్టపడే వారికి మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో న్యాచురల్ లొకేషన్స్ లో మన చుట్టూ జరిగే కథలా అనిపించే చిత్రం తత్వం.


