టాలీవుడ్‌లో అవును, ప్రేమా ఇష్క్ కాదల్, మాయ, ఫిదా, బాలీవుడ్‌లో సనమ్ తేరి కసం, పాల్తాన్, హసీన్ దిల్‌రూబా వంటి సినిమాల్లో నటించిన హర్షవర్ధన్ రాణే కూడా కరోనా భారిన పడ్డాడు. ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కోవిడ్ వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణం తరువాత ఈ విషయాన్ని చాలా మంది సీరియస్ గా తీసుకుంటున్నారు.
ఇక రీసెంట్ గా మరొక యువ నటుడు కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోగా అతనికి పాజిటివ్ అని తేలింది. హర్ష కేవలం తెలుగు సినిమాలతోనే కాకుండా పలు బాలీవుడ్ సినిమాలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇటీవల ట్విట్టర్ లో హర్ష తనకు తీవ్ర జ్వరం తలనొప్పి ఉండడంతో హాస్పిటల్ కి వెళ్లినట్లు చెప్పాడు. అక్కడ పరీక్షల్లో పాజిటివ్ ఉందని తెలియగానే వెంటనే హౌజ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు.