JAAN ఫస్ట్ లుక్ విడుదల

ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న JAAN ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ, ప్రేమ, అనుబంధం, తోడుగా నిలిచే బంధం చుట్టూ సాగే కథను పరిచయం చేస్తోంది.

ఆర్యన్ గౌర రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, బాబా భాస్కర్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వీల్‌చైర్‌లో కూర్చున్న మోనిషా వెనుక ఆర్యన్ నిలబడి, వీల్‌చైర్ హ్యాండిల్స్‌పై చేతులు ఉంచి కనిపిస్తున్నారు. మోనిషా చిరునవ్వు, అందమైన ప్రకృతి నేపథ్యం, అలాగే “Forever” అనే పదం పోస్టర్‌కు మరింత ఎమోషనల్ టచ్‌ను అందిస్తున్నాయి.

వీల్‌చైర్‌ను టైటిల్ డిజైన్‌లో క్రియేటివ్‌గా భాగం చేయడం ఫస్ట్ లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక పోస్టర్‌లో కనిపించే క్యూట్ డాగ్ కూడా తనదైన శైలిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ చిత్రానికి మూడు సార్లు నేషనల్ అవార్డ్ విజేత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అమరన్ చిత్రానికి ఇటీవల అందుకున్న నేషనల్ అవార్డ్‌తో ఆయన మూడు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నారు. గతంలో సూరరై పొట్రు, వాతి చిత్రాలకు కూడా ఆయన నేషనల్ అవార్డులు అందుకున్నారు.

లక్ష్మీ నరసింహా మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న JAAN చిత్రం నిజ జీవిత సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కుతోంది. ప్రేమ, అనుబంధం, జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా నిలిచే భావోద్వేగాలను ఈ చిత్రం ఆవిష్కరించనుంది.

Related Articles

Latest Articles