“దోబుచులాటేలరా” మూవీ రివ్యూ

గ్రాండ్ డ్రీమ్స్ ప్రొడక్షన్, ఫస్ట్ లుక్ ఫిల్మ్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై ప్రశాంతి గుమ్మి నిర్మాతగా రూపోందిన చిత్రం దోబుచులాటేలరా. మల్టిట్యాలెంటెడ్ దర్శకుడు రామ్ కిరణ్ రెడ్డి.బి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25 నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్ పామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సూర్య భరత్ చంద్ర, చాంధిని రావు, వైవా రాఘవ, శ్రీ అన్వేష్, రాజశేఖర్ అనిగి, రాఖీ, హర్షితా, శ్రీవల్లి విజయ, రాహుల్ నడింపల్లి, టీఎన్ఆర్ తదితరులు నటించిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
సొంతంగా ఫొటోగ్రఫీ స్టూడియో ఏర్పాటు చేయాలని కలలు కనే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ చిత్ర(చాంధిని రావు) తను పనిచేస్తున్నా ఫోటోగ్రఫీ ఆఫీసులో బాసుతో గొడవపడి జాబ్ మానేస్తుంది. సిటీలో ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని సొంత ఊరిని వదిలి సిటీకి వచ్చిన అర్జున్(సూర్య భరత్ చంద్ర) తన ఫ్రెండ్ బాబు స్టూడియో చూసి నిరాశ పడుతాడు. ఇలా అనుకోకుండా చిత్ర, అర్జున్ ల లక్ష్యం ఒకటే కావడంతో ఒక సందర్భంలో కలుస్తారు. షూట్ ఉందని చిత్ర దగ్గర కెమెరా తీసుకెళ్లిన అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కంగారు పడ్డ చిత్ర పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అసలు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు? చిత్రను మోసం చేశాడా? మళ్ళీ ఇద్దరు ఎలా కలిశారా? అర్జున్ ను పోలీస్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? కిడ్నాప్ కేసు లో, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాస్క్ లు పెట్టుకున్న వ్యక్తులు ఎవరు? వరంగల్ పెద్దిరెడ్డికి హీరోకు ఏంటీ సంబంధం? కెమెరా కోసం హీరో, హీరోయిన్ చేసే రిస్క్ ఏంటో తెలియాలంటే దోబుచులాటేలరా సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :
హీరో, హీరోయిన్ ఇద్దరికీ బెస్ట్ ఫోటోగ్రాఫర్ కావాలి అదే లక్ష్యం. ఆ లక్ష్యమే ఇద్దరినీ కలుపుతుంది. అందుకు డిజైన్ చేసిన సీన్స్, తెరమీద చూపించిన తీరు మెప్పిస్తుంది. ఇద్దరి మధ్య పరిచయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. వారి పరిచయం అయిన తరువాత వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కెమెరా తీసుకొని అర్జున్ మిస్ అయిన తరువాత ఆ టెన్షన్ కూడా బాగా బిల్డ్ చేశారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే దోబుచులాటేలరా అన్నట్లు సాగుతుంది. సినిమాకు తగిన టైటిల్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే పెంచాలదాసు సాంగ్ చాలా బాగుంది.

ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే డ్రామా కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ బాస్ గా యాక్ట్ చేసిన వైవా రాఘవ పాత్ర ఎంట్రీతో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. ఇక అక్కడ నుంచి కెమెరాను వెతికే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. కామెడీగా మొదలైన కెమెరా కోసం వెతికే సన్నివేశాలు చివరికి సీరియస్ గా మారడం ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే హీరోయిన్ కు ఫోటోగ్రఫీ అంటే ఎందుకు అంత పిచ్చో అని చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఆకట్టుకుంటాయి. అలాగే లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ మెసేజ్ కూడా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు అలా సాగిపోతుంది. ఎక్కడ కూడా ఈ సీను ఎందుకు అనిపించదు. చాలా కామెడీగా సాగిపోతుంది.

నటీనటుల నటన :
హీరో సూర్య భరత్ చంద్ర కొత్త వాడైనా చాలా బాగా యాక్టింగ్ చేశారు. కామెడీ సీన్లతో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండించాడు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇక ముందు కూడా మంచి క్యారెక్టర్ పడితే అద్భుతంగా చేయగలడు అనిపించింది. హీరోయిన్ చాంధిని రావు కూడా ఆకట్టుకుంది. చాలా స్కోప్ ఉన్న పాత్రలో తన హావభావాలతో ఆకట్టుకుంది. ఎమోషన్స్ కూడా బాగా పండించింది. పోలీస్ గా టీఎన్ఆర్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. పెద్దిరెడ్డిగా రాజశేఖర్ అనిగి తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో ఒదిగిపోయిన శ్రీ అన్వేష్, బాబు పాత్రలో కామెడి పండించాడు. మిగితా నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.

సాంకేతిక విశ్లేషణ :
రచన – దర్శకుడిగా మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీ, ఎడిటర్ గా రామ్ కిరణ్ రెడ్డి ఛాలెంజింగ్ పాత్ర పోషించాడు. సినిమా మీద ఎంతో పట్టు ఉంటే గాని ఇలా చేయడానికి సాధ్యపడదు. డైలాగ్స్ కూడా అద్భుతమైన పంచ్ లైన్స్ తో నింపేశారు. ప్రతీ ఫ్రేమ్ లో రామ్ కిరణ్ రెడ్డి ప్రతిభ కనిపించింది. ప్రేక్షకులకు మెప్పించడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. అలాగే కెమెరాకు సంబంధించి కొన్ని విషయాలను డిటైలింగ్ గా చెప్పడం మెప్పించింది. భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్స్ చేసే సత్తా ఆయనలో ఉందనిపించింది. సినిమాకు సంగీతం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ మెప్పించాయి. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. పతాక సన్నివేశాల్లో బీజీఎమ్ చాలా బాగా వచ్చింది. హరి చరణ్ పాడిన ట్రావెల్ సాంగ్ ఒక ప్రత్యేకం. అలాంటి పాట తెలుగు లో అరుదు. పెంచల్ దాస్ పాడిన పాట ఒక కొత్త ఫ్లేవర్ యాడ్ చేసింది. ఈ రెండు పాటలు యొక్క జానర్ జోనర్ తెలుగు సినిమా సంగీతంలో అరుదుగా ఉంటాయి. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత ప్రశాంతి గుమ్మి, ఓబుల్ రెడ్డి సినిమా టెస్ట్ ఉన్న నిర్మాతలు అనిపించుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, ట్విస్ట్ లు, కామెడీ, పాటలు

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే, నూతన నటీనటులు

సారాంశం :
మంచి ట్విస్టులతో కూడిన ఎంటర్టైనింగ్ చిత్రం దోబుచులాటేలరా.

Related Articles

Latest Articles