‘అనుమాన పక్షి’, జాతి రత్నాలు, డీజే టిల్లు లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది : హీరో రాగ్ మయూర్

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రాగ్ మయూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

డైరెక్టర్ విమల్ కృష్ణ ‘డీజే టిల్లు’ ప్రభావం పడకుండా ఇందులో ఎలాంటి కేర్ తీసుకున్నారు?

-విమల్ కృష్ణ ట్రెండ్ ఫాలో అవ్వడానికి ఇష్టపడరు. అందుకే ఆయన ‘డీజే టిల్లు’ చేసిన తర్వాత పార్ట్ 2 చేయలేదు.. ‘అనుమాన పక్షి’ కూడా చాలా డిఫరెంట్. కాకపోతే ‘డీజే టిల్లు’ లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.

-‘డీజే టిల్లు’ లాంటి పాత్ బ్రేకింగ్ సినిమా తర్వాత విమల్ కృష్ణకి ఇంకా పెద్ద హీరో దొరుకుతారు. కాకపోతే ఆయన నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. తన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 

-‘అనుమాన పక్షి’, ‘జాతి రత్నాలు’, ‘డీజే టిల్లు’ లాంటి పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ‘డీజే టిల్లు’, ‘జాతి రత్నాలు’ ఊహించని విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా ఊహించని విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. 

కథ, జానర్ ఎలా ఉండబోతుంది?

-ఇందులో మల్టిపుల్ జానర్స్ ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తో మొదలై మిస్టరీ జానర్‌లోకి వెళ్లి థ్రిల్లర్, హారర్ టచ్ కూడా ఉంటుంది. సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది.

క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

-ఇందులో హీరో క్యారెక్టర్‌కి అనుమానాలు ఎక్కువ. తన అనుమానాలతో చుట్టూ ఉన్న అందరికీ పిచ్చెక్కిస్తుంటాడు. తను కశ్మీర్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వచ్చే కామెడీ చాలా కొత్తగా ఉంటుంది.

కశ్మీర్‌లో చిత్రీకరణ గురించి?

-కశ్మీర్‌ని ఎప్పుడూ ఒక సీరియస్ సిచువేషన్‌కి వాడుతుంటారు. ఫస్ట్ టైం ఒక లైట్ హార్టెడ్ కామెడీకి వాడుతున్నాము. అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అలాంటి ప్లేస్‌ని ఒక లైట్ హార్టెడ్ జోనర్‌గా చూపించే ప్రయత్నం చాలా కొత్తగా ఉంటుంది.

-పహల్గామ్ ఘటన తర్వాత అక్కడ షూటింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. అక్కడ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాశ్మీర్ ప్రపంచంలోనే బ్యూటిఫుల్ ప్లేస్.

ఇందులో కాస్ట్యూమ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి?

-హీరో క్యారెక్టర్‌కి అనుమానాలు ఎక్కువ. మన బట్టల్ని ఎవరికో దానం చేస్తున్నప్పుడు వాళ్లు మన మీద ఏదైనా చేతబడి చేస్తారని అనుమానపడతాడు. అందుకే ఇంట్లో ఉండే పాత చీరలు, కర్టెన్స్‌తో కూడా బట్టలు తయారు చేసుకుంటాడు.

-ఈ సినిమాకి అలాంటి రిఫరెన్స్ లేదు. అదే ఈ సినిమా బ్యూటీ. ఒరిజినల్‌గా ఆలోచించే వాళ్లకి రిఫరెన్స్ ఉండదు. ఇది కూడా ఆ కేటగిరీకి చెందినది.

రమణ గోగుల గారి పాట గురించి?

-రమణ గోగుల అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన పాడిన పాటలన్నీ గుర్తుకు వస్తాయి. అలాంటి ఆయన నా తొలి సోలో సాంగ్ పాడటం చాలా ఆనందంగా అనిపించింది.

కామెడీ చేయడం కష్టం అంటారు కదా.. మీకు ఎలా అనిపించింది?

-నన్ను మొదటినుంచి ప్రేక్షకులు ఒక కామెడీ జోన్‌లోనే అప్రిషియేట్ చేశారు. ‘సినిమా బండి’, ‘కీడా కోలా’, ‘మిత్రమండలి’ ఇవన్నీ కూడా కామిక్ జోన్ సినిమాలే. నాకు ఒక ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉందని ప్రేక్షకులు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇందులో కూడా కామెడీ బాగా వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నాను. నాకు ఎక్కువగా కామెడీ క్యారెక్టర్స్ వస్తుంటాయి. కాకపోతే నాకు సీరియస్ రోల్ కూడా చేయాలని ఉంటుంది.

‘అనుమాన పక్షి’లో ఎమోషన్ ఎలా ఉంటుంది?

-ఇందులో ఎమోషన్ కంటే కామెడీ, థ్రిల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అది మీరు స్క్రీన్ మీద చూడాలి.

శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ గురించి?

-శ్రీ చరణ్ గారి 50వ సినిమా ఇది. ఆయన థ్రిల్లర్స్‌కి స్పెషలిస్ట్. ఇందులో అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ మ్యూజిక్ చేశారు. ఎప్పుడైనా యాక్టింగ్‌కి మ్యూజిక్ కాంప్లిమెంట్ అయితేనే వాల్యూ వస్తుంది.

రాశి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

-రాశి గారి క్యారెక్టర్ చాలా కామిక్‌గా ఉంటుంది. తను ఆత్మలకు కస్టమర్ కేర్‌లాగా ఉండే క్యారెక్టర్. ఆత్మలతో మాట్లాడగలుగుతుంది. అలాగే అజయ్ గారి క్యారెక్టర్ కూడా ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. అందులో ఆయన చాలా సర్‌ప్రైజ్ ప్యాకేజ్.

నెక్స్ట్ సినిమాలు?

-‘గరివిడి లక్ష్మి’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘అంతా భ్రాంతియేనా’ అనే సినిమా చేశాను. అది నవంబర్‌లో రావచ్చు.

Related Articles

Latest Articles