
మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్ర ఈ విషయాన్నికి వస్తే…
కథ :
పిఠాపురం సమీప గ్రామంలో ముగ్గురు యువతులు చిన్నప్పటినుండి స్నేహితులు. ఒకటి గ్రామం కావడంతో వారి తండ్రులు కూడా స్నేహితులు. అయితే వారిలో మొదటి అమ్మాయి తండ్రి స్కూల్ మాస్టర్ కావడంతో చాలా క్రమశిక్షణ పేరిట స్ట్రిక్ట్ గా ఉంటారు. మరొక అమ్మాయి తండ్రి ధనవంతుడు కావడంతో తన కూతురుకు అధిక స్వేచ్ఛను ఇస్తారు. మరొక అమ్మాయి తండ్రి ఊరి పెద్ద కావడంతో తనకు మంచి చెడులు అన్ని నేర్పుతూ పెంచుతారు. ఇది ఇలా ఉండగా వారి ముగ్గురు పిఠాపురంలో కాలేజీలో ప్రేమలో పడతారు. ఆ తరువాత ఆ ముగ్గురు వారి ప్రేమలలో గెలుస్తారా లేదా? వారి తల్లిదండ్రుల సపోర్ట్ వారికి లభిస్తుందా లేదా? వారి పెంపకాలు వారి పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? అసలు ఆ వయసులో ఏది మంచిది, ఏది మంచి కాదు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ సినిమాలో గ్రామ పెద్ద పాత్రలో పోషించిన రాజేంద్రప్రసాద్ చాలా నిదానమైన మనిషిగా అన్ని విషయాలు తెలిసి ధర్మంగా ఉన్నత విలువలు ఉన్న పాత్రలో చాలా బాగా నటించారు. అలాగే డబ్బున్న వ్యక్తి లాగా పృథ్విరాజ్ గారు చాలా సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. స్కూల్ మాస్టర్ పాత్రలో కేదార్ శంకర్ గారు బాగానే నటించారు. శ్రీలు, ప్రత్యూష, రెహానా స్కూల్ వయసు నుండి ఆ తరువాత కాలేజీ అలాగే పెద్దవారయ్యే వరకు తమను తాము కాస్త విభిన్నంగా చూపించుకుంటూ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించారు. అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్ తమ పాత్రలకు తగ్గట్లు స్టేబుల్ గా నటించారు. చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్లు పర్ఫామెన్స్ ఇచ్చారు.
సాంకేతిక విశ్లేషణ :
తల్లిదండ్రుల పెంపకాల బట్టి పిల్లలు ఎలా ఉంటారో ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఒక కథను రాసుకుని చాలా స్పష్టంగా తెరకెక్కించడంలో దర్శకులు విజయం సాధించారు. సినిమా కాస్త నిదానంగా ఉన్నప్పటికీ చక్కటి సందేశాత్మకచితంగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే విధంగా ఈ కథ ఉంది. లొకేషన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. బిజిఎం అంతగా లేనప్పటికీ పాటలు పరవాలేదు. విజువల్స్ చాలా బాగున్నాయి కానీ డైలాగులు కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత బాగా సాంకేతిక విషయాలు బాగుండేవి.
ప్లస్ పాయింట్స్ :
కథ, లొకేషన్స్, నటీనటుల నటన
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లేస్ లోగా ఉండటం, బిజిఎం
సారాంశం :
ప్రస్తుత సమాజంలో పిల్లల పెంపకం ఎలా ఉండాలో చూపిస్తూ పెద్దవారి ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించిన చిత్రం పిఠాపురంలో అలా మొదలైంది.


