“మిస్సింగ్ మేఘన” చిత్ర రివ్యూ

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిస్సింగ్ మేఘన. శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
తండ్రి చాటున పెరిగిన ఒక అమ్మాయి తన సొంత కష్టంతో బేకరీ మొదలుపెడుతుంది. తన జీవన ప్రయాణంలో కొన్ని సవాళ్లు వచ్చినా వాటిని దాటుకుని సాఫీగా ముందుకు వెళ్తున్న తాను ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి తన స్నేహితుడితో కలిసి తనకు అప్పటికే పోలీస్ తో పెళ్లి సంబంధం ఫిక్స్ కావడంతో వెతకడం మొదలుపెడతారు. అలా జరుగుతుండగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బయటకు వస్తూ ఉంటాయి కానీ అసలు ఆమె మిస్ అవ్వడానికి కారణం ఏంటి? తన బేకరీలో ఏం జరుగుతుంది? అది ఆమెకి తెలిసి జరుగుతుందా లేదా తెలియక జరుగుతుందా? తనకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా? డ్రాప్ మీ వ్యక్తికి తనతో ఉన్న పరిచయం ఎటువంటిది? ఒక్కొక్కరి వల్ల తన జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? అసలు దీనంతటికీ కారణం ఎవరు? చివరికి ఆ అమ్మాయి దొరుకుతుందా లేదా? బ్రతికి ఉంటుందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తనపై ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :
అమ్ము అభిరామి (మేఘన) ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు. తన చుట్టూ తన గురించి ఈ సినిమా నడవడంతో సినిమా అంతటలో తానే మూలమై కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో అమాయకంగా అలాగే మరికొన్ని సందర్భాలలో చాలా మహిళగా కనిపిస్తూ ప్రతి ఎమోషన్ & ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తూ తన నటనా ప్రతిభను చూపుతూ ప్రేక్షకులను మెప్పించారు. రామ్ కార్తీక్ (కార్తీక్) అటు ఒక లవర్ బాయ్ గా అలాగే మరోవైపు బ్రేకప్ అయిన పాత్రలోనూ కనిపిస్తూ ఒక బ్యాలెన్స్ పాత్రను పోషిస్తూ చాలా బాగా నటించారు. అంకిత్ కొయ్య తన గత కొన్ని చిత్రాల వలె ఈ సినిమాలో కూడా కాస్త సాధారణ పాత్ర పోషించినప్పటికీ సినిమాలో కీలక పాత్రగా మారుతుంది. మరొక విభిన్నమైన తరహాలో కనిపిస్తూ ప్రేక్షకులను షాక్ చేస్తారు. గోపరాజు రమణ గారు ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి పాత్రలో చాలా న్యాచురల్ గా నటిస్తూ కనిపించారు. అలాగే వైదిక సంజాలియా తన పాత్ర తక్కువ సమయమైనప్పటికీ మంచి ఇంపాక్ట్ వచ్చేలా నటించారు. పోలీస్ పాత్రలో కనిపించిన వ్యక్తి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్ర పరిధిలో నటిస్తూ సినిమాకు ప్లస్ గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
ఇటువంటి కథలు గతంలో కొన్ని వచ్చినప్పటికీ ఈ సినిమాలో సస్పెన్స్ క్యారీ చేయడంలో దర్శకుడు విజయం సాధించారు. ముఖ్యంగా అసలు ఎవరు చేసి ఉంటారు అనే ప్రశ్నతో ప్రేక్షకులు ఎంతో ఎక్సైట్ అయ్యే విధంగా సినిమాను వెండి తలపై చూపించడం చాలా పెద్ద విషయం. ఆ విషయంలో అక్కడక్కడ తడబడినప్పటికీ దర్శకుడు మంచి విజయం సాధించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ పాటలు బాగున్నాయి. లొకేషన్స్, కలరింగ్ చాలా నాచురల్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కాస్త జాగ్రత్త పడాల్సింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బావున్నాయి. కొన్ని రాబోతున్న సన్నివేశాలు అర్థమవుతున్నప్పటికీ కొంతవరకు బాగానే క్యారీ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన, దర్శకత్వం, పాటలు

మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు, బిజిఎం

సారాంశం :
ఇటీవల ఎన్ని సస్పెన్స్ సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాలోని మలుపుల వల్ల ప్రేక్షకులు కథలో లీనమై సినిమాను ఎంజాయ్ చేసే విధంగా మిస్సింగ్ మేఘన చిత్రం వినోదాన్ని అందిస్తుంది.

Related Articles

Latest Articles