వినాయక చవితి సందర్భంగా అజయ్ అరసాడ ‘బోలో గణపతి S/O ఉమాపతి’ స్పెషల్ సింగిల్ విడుదల

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ వినాయక చవితి సందర్భంగా ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పేరుతో ప్రత్యేక సింగిల్‌ను నేడు విడుదల చేశారు. ఈ పాటకు అజయ్ అరసాడ సంగీతం అందించడంతో పాటు, తన మ్యూజిక్ లేబుల్ AjA Recordsపై స్వయంగా నిర్మించారు. విశాఖపట్నానికి చెందిన అజయ్ అరసాడ సంగీత నేపథ్యంతో పాటు టీసీఎస్‌లో ఏడు సంవత్సరాలు పనిచేసిన అనంతరం సినీ సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. విభిన్న జానర్స్‌లో పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ను, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కలిసి అభినందించడంతో పాటు, భవిష్యత్తులో కలిసి పనిచేయాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం.

తాజాగా విడుదలైన ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పాటను అజయ్ అరసాడ కేవలం రెండు రోజుల్లోనే కంపోజ్ చేశారు. గణపతిని ఉత్సాహభరితంగా, యూత్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసేలా రూపొందించిన ఈ పాటను జయరామ్ పైలా, సింధూర రాజేష్ ఎనర్జిటిక్‌గా గానం చేయగా, భాస్కర్ తిరుమల సింపుల్‌గా, ట్రెండీగా, అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. లిరికల్ సాంగ్ లో సాంగ్ కంపోజిషన్ ను చూపిస్తూ మధ్యలో లిరిక్స్ తగ్గట్టు ఉండే గణేష్ మహారాజ్ పెయింటింగ్ ఫ్రేమ్స్ రావడం ఆకట్టుకుంటుంది.

ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచేది డివోషనల్ సాంగ్ కు ఇచ్చిన ట్రెండీ టచ్. తెలుగు సాహిత్యం తో సంస్కృత పదాలతో పాటూ సహజంగా ఇమిడిపోయే ఇంగ్లీషు పదాన్నీ మేళవిస్తూ రూపొందించిన ఈ పాట వినూత్నమైన అనుభూతిని అందిస్తుంది. క్యాచీ లిరిక్స్, పెప్పీ బీట్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో జెన్ జీ తో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునేలా ‘బోలో గణపతి S/O ఉమాపతి’ రూపొందింది.

భక్తి, ఉత్సాహం, ఆధునిక సంగీత శైలిని కలిపిన ఈ పాట గణేష్ చతుర్థి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వినగానే ఆకట్టుకునే ఎనర్జీ, ఒక హ్యాపీ వైబ్ తో సాగే ట్రెండీ లిరిక్స్, గణపతిని కొత్త తరహాలో సెలబ్రేట్ చేసే విధానం ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పాటకు ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. అజయ్ అరసాడ నిర్మాతగా మారి ప్రారంభించిన AjA Records కి ఘనమైన ప్రారంభాన్ని ఇచ్చింది.

పాట : బోలో గణపతి S/o ఉమాపతి
సంగీతం : అజయ్ అరసాడ
సాహిత్యం : భాస్కర్ తిరుమల
గాయకులు : జయరామ్ పైలా, సింధూజ రాజేష్
రిథమ్స్ : సాయిరామ్ పైలా
కీబోర్డ్ ప్రోగ్రామింగ్ : జయరామ్ పైలా
నాదస్వరం : మల్లికార్జున్
నిర్మాత : అజయ్ అరసాడ
కెమెరా : శ్రీకర్ (@Siacaptures)
కాన్సెప్ట్ & ఎడిటింగ్ : వెంకట్ చిక్కాల
పీ ఆర్ ఓ : ఇండస్ట్రీహిట్ శివ
స్టూడియో & లేబుల్ : AjA Records

Related Articles

Latest Articles