కరోనా నుంచి కోలుకున్న విజయ్ కాంత్.. భార్యకు పాజిటివ్

కొన్ని రోజుల క్రితం కోలీవుడ్ సీనియర్ హీరో విజయకాంత్ కరోనా వైరస్ భారిన పడిన విషయం తెలిసిందే. కొంత అస్వస్థతకు గురైనపుడే హాస్పిటల్ జాయిన్ అయిన ఆయన చికిత్స కోసం చెన్నైలోని MIOT ఆసుపత్రులలో చేరారు. ఇక ఆయన చికిత్స తీసుకుంటూ ఉండగా అతని భార్య ప్రేమలత కూడా కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది.

హాస్పిటల్ బోర్డు ఈ రోజు ఒక ప్రకటనను విడుదల చేసింది, విజయకాంత్ పూర్తిగా ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఎలాంటి లక్షణాలు లేవని నిర్దారణ అయిన తరువాతనే డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. అయితే ఇంతలో ఆయన భార్య చికిత్స కోసం హాస్పిటల్ జాయిన్ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. దీంతో సీనియర్ నటీనటులు చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తోంది.