ప్రముఖ సినీ నిర్మాత అశ్వినిదత్కు గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో 39 ఎకరాల భూమి ఉంది. అయితే గత ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయం విస్తరణ కోసం ఆ భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికి సమానంగా ఉండే భూమిని, అమరావతిలో ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించి ఒక డీల్ సెట్ చేసుకుందట. కానీ ప్రభుత్వం మారిన తరువాత అమరావతిలో భూమి విలువ తగ్గిపోయింది.
ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ అశ్విని దత్ హై కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం గన్నవారంలో అశ్విని దత్ యొక్క భూమి విలువ మరింత పెరిగింది. గన్నవరంలో ప్రభుత్వ ధర ఎకరానికి సుమారు 1.8 కోట్ల రూపాయలట. ఇక విమానాశ్రయం విస్తరణ కోసం తన భూమిని ఇవ్వడానికి అశ్విని దత్ ఎకరానికి నాలుగు రెట్లు ప్రభుత్వ విలువను అడుగుతున్నట్లు సమాచారం. మొత్తంగా తన భూమికి 210 కోట్ల రూపాయలు అడుగుతున్నారట. మార్కెట్ విలువ మరియు ప్రభుత్వ విలువ మధ్య వ్యత్యాసాన్ని బట్టి ఆయన డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అశ్విని దత్ యొక్క డిమాండ్ చట్టబద్ధంగా సాధ్యమా కాదా అనే విషయంపై కోర్టు తీర్పును వెలువరించనుంది.