గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం మరణించి మూడు రోజులు అవుతోంది. అయినప్పటికీ ఇంకా ఆయన ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తోందని చాలా మంది సినీ తారలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా బాలసుబ్రహ్మణ్యంను కడసారి కూడా చూసుకోలేదని ఎంతో మంది అభిమానులు మనోవేదనకు గురవుతున్నారు. ఇక ఆయన స్మారకమందిరం నిర్మించడంపై ఎట్టకేలకు కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.
ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. నాన్న ఖననం చేసిన ప్రాంతంలోనే స్మారక మందిరం త్వరలో నిర్మిస్తాము అని వివరణ ఇవ్వడంతో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది. ఇక తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో శనివారం బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఆయన ఫామ్ హౌజ్ లోనే న్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఖననం చేసిన ప్రాంతంలోనే ఆదివారం కుటుంబ సభ్యులు సంప్రదాయ ఆచారాలను పూర్తి చేసి పూజలు చేశారు. ఇక్కడే ఎస్పీ బాలు స్మారక మందిరం నిర్మించనున్నట్లు ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు.