సెప్టెంబర్ 7 నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి “కాకా” హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ కాకా.  వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన  టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ‘కాకా’ నెక్స్ట్ భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ లెన్తీ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.  

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి షూటింగ్ లొకేషన్ లో డిస్కస్ చేస్తూ కనిపించారు. ఈ బిహైండ్ ద సీన్  పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్. సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటింగ్. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్‌గా పనిచేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.

 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: లోహిత్ NK
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల
యాక్షన్: రామ్ – లక్ష్మణ్, నబకాంత్
డైలాగ్స్: భాను-నందు
అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Related Articles

Latest Articles