చిరంజీవి గారి ఆశీర్వాదం వల్లే ఈ స్టేజ్‌లో ఉన్నాను – రాఘవ లారెన్స్

kanchana 3 pre release event

రాఘవ లారెన్స్‌, ఓవియా, వేదిక, కొవైసరళ, శ్రీమాన్‌ ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం ‘కాంచన 3’. లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్‌ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో లారెన్స్‌ చారిట్రబుల్‌ ట్రస్ట్‌ బ్రోచర్‌ను అల్లు అరవింద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా..

లగడపాటిశ్రీధర్‌ మాట్లాడుతూ – ”సినీ ఇండస్ట్రీలో నాకు చాలా నచ్చిన వ్యక్తుల్లో లారెన్స్‌ ఒకరు. మాస్‌ కాదు.. డబుల్‌ మాస్‌ అని ఈ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంది. కానీ ట్రైలర్‌, సాంగ్స్‌ చూస్తుంటే ఇది ట్రిపుల్‌ మాస్‌లా కనపడుతుంది. ఈ సమ్మర్‌కి ఈ సినిమా అందరినీ కూల్‌ చేస్తుందని అనుకుంటున్నాను. అమెరికాలో సిల్వర్‌స్టెలోని తనని తాను హీరోగా తయారు చేసుకున్నాడు. అలాగే లారెన్స్‌ కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. అంతకు మించి సోసైటీకి చారిటీ ద్వారా సేవ చేస్తున్నాడు. చాలా మందికి ఆయన ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈసినిమాలో భయంతో పాటు మంచి వినోదాన్ని కూడా అందిస్తున్నారు. ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను”” అన్నారు.

కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ – ”ఇన్నేళ్ల జర్నీ తర్వాత సాధారణంగా హీరోలు, డ్యాన్స్‌ మాస్టర్స్‌ రిలాక్స్‌ అయిపోతారు. కానీ లారెన్స్‌లో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని అనిపిస్తుంది. ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు” అన్నారు.

శ్రీమాన్‌ మాట్లాడుతూ – ”కాంచన సిరీస్‌ను 8 నుండి 80 వయసులు ఉన్న వారికి నచ్చే విధంగా లారెన్స్‌గారు రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో మరింత పెద్ద విజయాన్ని దక్కించుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ”పాతికేళ్లుగా మా కుటుంబానికి లారెన్స్‌ చాలా మంచి సన్నిహితుడు. చిన్న డ్యాన్సర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి ‘హిట్లర్‌ సినిమాకు డ్యాన్స్‌ మాస్టర్‌గా మారి.. ఇప్పుడు లారెన్స్‌ ఓ బ్రాండ్‌లా తయారయ్యాడు. అతని సినిమా వస్తుందంటే, అందరూ వెయిట్‌ చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశం లారెన్స్‌కు లేదు. సంపాదించిన దాన్ని పది మందికి పంచాలనుకుంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవిగారు తన శిష్యుడ్ని అభినందిస్తూ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఆయన తరపున నేను లారెన్స్‌కు చెక్కును అందిస్తున్నాను” అన్నారు.

రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో నాతో పాటు నటించిన వేదిక మునిలో నాతో పాటు నటించింది. లక్కీ హీరోయిన్‌. ముందుకన్నా తను ఎంతో ఇంప్రూవ్‌ అయ్యింది. ఇప్పుడు కాంచన 3లో నటించింది. నిక్కీ తంబోలి చాలా చక్కగా కామెడి నటనతో మెప్పించింది. ఇక శ్రీమాన్‌ గురించి చెప్పాలంటే .. ఈ సినిమాలో శ్రీమాన్‌, కోవైసరళ, దేవదర్శిని లేకుండా ఉండుంటే ఏదో ఒకటి మిస్‌ అయిన ఫీలింగ్‌ ఉండుండేది. ఈ సినిమాలో నాకంటే వాళ్లే అసలు హీరోలు. వాళ్లే కామెడీ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి కూడా థాంక్స్‌. ఆయన సినిమాను చక్కగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఆయనకు ఈ సినిమా మంచి పేరు, డబ్బులు తెచ్చిపెట్టాలని ఆ రాఘవేంద్ర స్వామిని కోరుకుంటున్నాను. లగడపాటి శ్రీధర్‌గారితో స్టైల్‌ సినిమా చేశాను. ఇప్పుడు ఆయనే స్టైల్‌ 2 చేద్దామంటున్నారు. తప్పకుండా చేస్తాను. డ్యాన్స్‌ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్‌ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్‌ చేసేవాళ్లలో బన్ని, చరణ్‌, తారక్‌ బాగా చేస్తారు. అన్నయ్య గురించి ఈ సందర్భంలో చెప్పలేదని అనుకోవద్దు.. ఎందుకంటే ఆయనే అన్నింటికీ బాస్‌. కాబట్టి స్టైల్‌ 2 చేసేటప్పుడు పెద్ద హీరోలతో ప్లాన్‌ చేసి తీయాలి. సినిమా గురించి చాలా మంది మాట్లాడారు. అలాగే నేను ఇక్కడ చారిట్రబుల్‌ ట్రస్ట్‌ గురించి కూడా స్టార్ట్‌ చేస్తున్నాను. నేను ఇక్కడ డ్యాన్స్‌ మాస్టర్‌గా రాణించడానికి ముందు చిరంజీవిగారే నన్ను సెలక్ట్‌ చేసి నువ్వు బాగా ఎదుగుతావురా అని చెప్పారు. ఆయన ఆశీర్వాదం వల్లే ఈ స్టేజ్‌లో ఉన్నాను. ఆయన నాకు హిట్లర్‌ సినిమాలో డ్యాన్స్‌ మాస్టర్‌గా చాన్స్‌ ఇవ్వకుంటే.. నేను నెంబర్‌ వన్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ని అయ్యేవాడినే కాను. నాగార్జునగారు డైరెక్షన్‌ చాన్స్‌ ఇచ్చేవారే కారు. ఇప్పుడు 150 పిల్లలకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించేవాడిని కాను. నా ఇంట్లో 60 మంది పిల్లలు చదివేవాళ్లు కారు. ఇన్ని జరుగుతున్నాయంటే కారణం నన్ను ఆశీర్వదించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారికి.. అన్నయ్య చిరంజీవిగారికి… నన్ను డైరెక్టర్‌ని చేసిన నాగార్జునగారికి థాంక్స్‌. చారిట్రబుల్‌ ట్రస్ట్‌ ద్వారా.. నేను మంచి పనులు చేస్తున్నానంటే కారణం మా అమ్మగారే. ఆమే లేకుంటే నేను బ్రెయిన్‌ ట్యూమర్‌తో ఎప్పుడో చనిపోయేవాడిని. మా అమ్మే నాకు దేవుడు. ఆమెకు గుడి కూడా కట్టించాను. నీ కోసం బ్రతికితే సాధారణ జీవితం.. ఇతరుల కోసం బ్రతికితే చాలా గొప్ప జీవితం అని అమ్మ చెబుతుంటుంది. ఒకప్పుడు ఇంత సేవ చేస్తున్నాను కదా.. అనే గర్వం ఉండేది. అయితే నేనొక పనివాడిని మాత్రమే. దేవుడే నాలో ఉండి ఈ పనులన్నింటినీ చేయిస్తున్నాడని.. నేనొక పనివాడిని మాత్రమేనని అర్థమైంది. కొనడం కంటే ఇచ్చేటప్పుడు ఉండే సంతోషం చాలా గొప్పది. కాంచన సినిమా సమయంలో నేను థియేటర్‌ బయట కూర్చుని పాప్‌ కార్న్‌ తింటూ చూస్తున్నాను. ఓ అమ్మ తన ఇద్దరి పిల్లలతో థియేటర్‌కి వచ్చింది. టికెట్స్‌ అయిపోయిందని థియేటర్‌ వాళ్లు చెప్పారు. పిల్లలు ఏడవడం స్టార్ట్‌ చేశారు. వెంటనే ఆ అమ్మ తన దగ్గర దాచుకున్న డబ్బులతో బ్లాక్‌లో టికెట్స్‌ కొని సినిమాకు వెళ్లింది. ఆ దృశ్యం చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు డబ్బులు ఆడియెన్స్‌ నుండి కదా వస్తుంది. అలాంటి ఆడియెన్స్‌కు ఏదైనా చేయాలి. ఆలోచించి చారిట్రబుల్‌ ట్రస్ట్‌ను స్టార్ట్‌ చేశాను. అలాగే నేను డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎదిగింది తెలుగు రాష్ట్రాల్లోనే కదా.. మంచి సమయం చూసి చారిట్రబుల్‌ ట్రస్ట్‌ స్టార్ట్‌ చేయాలనే ఆలోచన ఉండేది. మా అమ్మ ఆశీర్వాదంతో ఇక్కడ కూడా చారిట్రబుల్‌ ట్రస్ట్‌ స్టార్ట్‌ చేశాను. 60 మంది పిల్లల్ని చదివించడం అంటే ఎక్కడో బయట పెట్టుకుని చేయొచ్చు. కానీ అలా కాకుండా వారిని నా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాను. ఎందుకంటే మంచి పనిని మన ఇంట్లో నుండే స్టార్ట్‌ చేయాలని నేను భావిస్తాను. కాబట్టి హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేయబోయే ఈ ట్రస్ట్‌కు నా వంతుగా 50 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నాను. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ సమస్య ఉన్నవాళ్లు, చదువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నన్ను కాంటాక్ట్‌ చేయవచ్చు. ట్రస్ట్‌ స్టార్ట్‌ చేస్తున్నానని చిరంజీవి అన్నయ్యకు చెప్పగానే.. ఆయన తాను కేరళకు వెళుతున్నానని చెప్పారు. ఆయన వీడియో బైట్‌ పంపుతారని అనుకున్నారు. కానీ ముందు ఆయన పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన నాకు మనిషి రూపంలోని దేవుడు. ఆయన ఆశీర్వాదం ఉంటే.. ఈ చారిట్రబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో మంచి పనులు చేయాలనుకుంటున్నాను. ఇలా చేయడం నా బాధ్యత అని అనుకుంటున్నాను. హెల్ప్‌ చేస్తే అది సరైన వాళ్లకి అందాలి. అలా కష్టాల్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని వారికి అన్నయ్య ఇచ్చిన పది లక్షల రూపాయలను ఇస్తాను. వారంరినీ అన్నయ్య దగ్గరకు పిలుచుకుని వచ్చి చూపిస్తాను. నాకు డ్యాన్స్‌ మాస్టర్‌గా చాన్సులు ఇచ్చిన అందరికీ థాంక్స్‌” అన్నారు.

https://photos.tfpc.in/kanchana-3-pre-release-event-photos/1131/