మాట మార్చిన రకుల్‌

డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఆమెతో పాటు, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకోనెలను కూడా ఎన్‌సీబీ విచారణకు నోటీసులు అంధించింది. అయితే మిగతా వారు అందుకు సిద్ధమవుతుండగా రకుల్ మాత్రం తనకు ఎలాంటి నోటీసులు అందలేవని మొన్నటివరకు షూటింగ్ లతో బిజీగా గడిపింది. ఇక అధికారులు సీరియస్ కావడంతో ఆమె తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక చివరకు తనకు నోటీసులు అందాయని కూడా ఆమె ఒప్పుకోవడంతో ఇప్పుడు అనేక రకాల అనుమానాలు వెలువడుతున్నాయి. ఇటీవల దీపికా మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్ ఖంబట్టాను అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా విచారణకు పిలువగా చాలా విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 24న శ్రుతి మదీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్‌లు ఎన్‌సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంటుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25న, ఇక మిగతా హీరోయిన్స్ సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎవరైనా సరే విచారణకు జరకాకపోతే నాన్ బెయిలబుల్‌ సమన్లు కూడా జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.