బిగ్ బాస్ 4 తెలుగుతో అల్లరి నరేష్‌కు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 4 మొదలై రెండు వారాలు అవుతుంది. ఇప్పటి వరకు రేటింగ్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇంట్లోకి రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు. తొలివారం తర్వాత కమెడియన్ కుమార్ సాయి వచ్చాడు.

బిగ్ బాస్ సీజన్ 4 మొదలై రెండు వారాలు అవుతుంది. ఇప్పటి వరకు రేటింగ్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇంట్లోకి రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు. తొలివారం తర్వాత కమెడియన్ కుమార్ సాయి వచ్చాడు. ఈయన వచ్చిన వారం రోజుల తర్వాత కానీ ఇంట్లో వాళ్ళతో కలవలేకపోయాడు. ఇక రెండో వైల్డ్ కార్డ్ 14 రోజుల తర్వాత వచ్చాడు. అతడే జబర్దస్త్ అవినాష్.. వచ్చీ రాగానే రచ్చ చేస్తున్నాడు ఈయన. ఈ సీజన్‌కు ఈ రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలే ఉంటాయని అనుకున్నారంతా. కానీ మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది.

ఈ సారి అబ్బాయిని కాకుండా అమ్మాయిని దించుతున్నారు. అది కూడా కత్తి లాంటి అమ్మాయిని తీసుకొస్తున్నాడు బిగ్ బాస్. ఇంట్లో ఇప్పటికే మోనాల్ గజ్జర్, హారిక, దివి, అరియానా లాంటి అందమైన అమ్మాయిలు ఉన్నారు. వాళ్లంతా గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. ఇప్పుడు వీళ్లకు తోడుగా మరో బ్యూటీని తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ఆమె పేరు స్వాతి దీక్షిత్. ఈ పేరు ఎక్కడా విన్నట్లు కూడా లేదు కదా.. కానీ తెలుగులో కొన్ని సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో అల్లరి నరేష్ హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ ఇంట్లో ఉంది. తన సత్తా చూపిస్తుంది.

బిగ్ బాస్ 4లోకి స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ (Swathi Deekshith Bigg Boss 4 Telugu)

దివి కూడా మహర్షి సినిమాలో నటించింది. ఇప్పుడు స్వాతి దీక్షిత్ కూడా వస్తుంది. ఈమె కూడా అల్లరి నరేష్‌తో రొమాన్స్ చేసింది. జంప్ జిలానీ సినిమాలో ఈమె రెండో హీరోయిన్‌గా నటించింది. దాంతో పాటు చిత్రాంగధ లాంటి సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ వర్కవుట్ అవ్వలేదు. దాంతో పూర్తిగా ఫేడవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈమెకు బిగ్ బాస్ బ్రేక్ ఇస్తున్నాడు. ఏదేమైనా ఈ సారి బిగ్ బాస్ సీజన్‌లో అల్లరి నరేష్ హీరోయిన్‌లు బాగానే సందడి చేస్తున్నారు.