కోలీవుడ్ సీనియర్ హీరోకు కరోనా వైరస్?

Vijayakanth

నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ కోవిడ్ -19 పరీక్షల్లో పాజిటివ్ అని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ సీనియర్ నటుడిని చెన్నై రామపురంలోని మియాట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. దేశియా ముర్పోక్కు ద్రవిడ కజగం వ్యవస్థాపకుడిగా జనాల్లో తన స్థాయిని మరింత పెంచుకున్న విజయ్ కాంత్ చాలా కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

అనేక సంవత్సరాలుగా ఆయన కొన్ని అనారోగ్య కారణాలతో సతమతమవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్న అభిమానులకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. విజయ్ కాంత్ వయసు ప్రస్తుతం 68 ఏళ్ళు. కోలీవుడ్ లో ఆయనను ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. చివరిసారిగా విజయ్ కాంత్ అతని కుమారుడు షణ్ముగ పాండియన్ చిత్రం సాగప్తం (2015) లో అతిధి పాత్రలో కనిపించాడు. ఇక విరుధగిరి (2010) అనే సినిమాలో చివరిసారిగా కథానాయకుడిగా నటించారు. ఆ సినిమాను విజయకాంత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.