
హీరో రవితేజ నటించిన ఇరుముడి సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇరుముడి సినిమాలో ప్రభుత్వ స్కూళ్లు, టీచర్లను కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ సీన్లను తొలగించాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ టీచర్ పాత్రను నెగటివ్ గా చూపించారని టీచర్ కనిపించే సీన్లలో రాష్ట్రంలోని ఒక స్కూల్ కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు. సినిమాలో స్టూడెంట్స్ కూడా ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలోని యూనిఫామ్ నే ధరించారని చిత్ర యూనిట్ వెంటనే స్పందించి ఆ సీన్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.


