కరోనా కారణంగా సినీ ప్రపంచం స్తంభించింది. లాక్ డౌన్ నుంచి నెమ్మదిగా అందరు అన్ లాక్ 4.0కి ప్రిపేర్ అవుతున్నారు. గత ఆరు నెలలుగా ఇంట్లోనే ఉండిపోయిన వారు ఇప్పుడు షూటింగులు, జిమ్ లు అంటూ బ్యాక్ టు నార్మల్ అంటున్నారు. లాక్ డౌన్ టైంలో అందరిలాగే ఇంట్లోనే ఎక్సర్సైజులు చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జిమ్ బాట పట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన కొణిదెల “Mr C Mr.C is back in the gym. How about u?” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఉపాసన చేసిన పోస్టులో కర్లీ హెయిర్ తో, ఫేస్ కి మాస్క్ వేసుకోని చరణ్ కళ్ళు మాత్రమే రివీల్ చేసేలా ఉన్నాడు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ లో అల్లూరి సీత రామరాజుగా నటిస్తున్న చరణ్, మార్చ్ 27న బయటికి వచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీజర్ లో టోన్డ్ బాడీతో సాలిడ్ గా కనిపించాడు. అయిదున్నర నెలలు ఇంటికే పరిమితం అయ్యాడు కాబట్టి మళ్లీ అలానే కనిపించాలి అంటే కష్టం. అందుకే రాజమౌళి షూటింగ్ మొదలుపెట్టే లోపు రామ్ చరణ్ తన పాత లుక్ లోకి రావడానికి రెడీ అయ్యాడు.