
సుహాస్, సూరి ముఖ్య పాత్రలుగా ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ మూవీని ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని సెప్టెంబర్ 10న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి భారీ ఎత్తున విడుదల చేయనుంది.
ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఇంటెన్స్ లుక్, పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. సుహాస్ మేకోవర్, చేతికి ఉన్న ఉంగరం, గడియారం ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఈ పోస్టర్లో కనిపించే సామాన్లు, సుహాస్ లుక్ చూస్తుంటే ఏదో యాక్షన్ సీక్వెన్స్‌కి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఈ సినిమాని సెప్టెంబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
నటీనటులు : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్
సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
సహ నిర్మాత : మణికందన్
దర్శకుడు : మదిమారన్ పుగళేంది
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్
యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ
ప్రొడక్షన్ డిజైన్ : డి.ఆర్.కె. కిరణ్
పీఆర్వో : సాయి సతీష్


