
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఎట్టకేలకు ఖాయమైనట్లు తెలుస్తోంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సినీవర్గాలు తెలిపాయి. స్టోరీ కూడా రెడీ అయిందని, రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. నందమూరి బాలకృష్ణకు గాయం కావడం, ఆ తర్వాత శస్త్రచికిత్స జరగడంతో ప్రకటన ఆలస్యమైనట్లు సమాచారం.


