“హుషార్ పిట్టలు” చిత్ర రివ్యూ

అన్ష్, వాసవి గణేశన్ జంటగా భిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మాతగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హుషార్ పిట్టలు. చరన్ అర్జున్ సంగీతాన్ని అందించిన చిత్రానికి రుద్ర సాయి సినిమాటోగ్రఫీ చేయగా మార్తాని కే వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. ప్రణిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రమేష్, అంజి, రసూల్ యాదవ్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఇక ఈ చిత్రం వస్తే…

కథ :
టీనేజ్ లో ఎవరికైనా ప్రేమ పుట్టడం అనేది చాలా సహజం కానీ ఆ ప్రేమ హద్దు మీరి ముందుకు వెళితే జరిగే పరిణామాల వల్ల జీవితాలు ఎలా మారతాయి, ఆ వచ్చే మార్పుల వల్ల కుటుంబాలు ఇటువంటి పరిస్థితులలోకి వెళ్లిపోతాయి అంటూ తెలియజేసే కథగా చెప్పుకోవచ్చు. ఒక పల్లెటూరిలో టీనేజ్ జంట ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. ఆ వయసులో వారు చేసే ప్రతి పని ప్రేమ అనుకుని ముందుకు వెళ్తారు. అయితే ఆ ప్రేమ హద్దులలో ఉంటుందా లేదా హద్దు మీరి ముందుకు వెళ్తుందా? ఆ పరిస్థితులలో వారికి ఏమవుతుంది? వారి కుటుంబాలకు ఈ విషయం తెలుసా ఆ కుటుంబాలలో తీసుకుని నిర్ణయాలు ఎటువంటివి? చట్టం వారికి సపోర్ట్ చేస్తుందా లేదా? అని అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపి ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది హీరో, హీరోయిన్ పాత్రలో నటించిన అన్ష్, వాసవి నటన గురించి. తొలిచిత్రమైనప్పటికీ ఇద్దరూ పోటాపోటీగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నటీనటుల వలె చాలా సహజంగా నటించారు. పల్లెటూరి వాతావరణంలో టీనేజ్ వయసులో ఉన్న జంట లాగా కనిపిస్తూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా పర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే వారి తల్లితండ్రుల పాత్రలు వేసిన వారు కూడా చాలా సహజంగా నటిస్తూ సినిమాలో సందర్భానుసారంగా ప్రతి ఎమోషన్ పండిస్తూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రణిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్న బాలుడి క్యారెక్టర్ చేసిన రసూల్ యాదవ్ చాలా బాగా నటించారు. అలాగే చిత్రంలో ఇతర పాత్రలు పోషించిన నటీనటులంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
గతంలో ఎన్నో టీనేజ్ ప్రేమకథలు వచ్చినప్పటికీ ఈ కథ కాస్త భిన్నంగా ప్రేక్షకులు చాలా సులువుగా అర్థం చేసుకునే విధంగా ఉంది. అటువంటి కథను వెండితెరపై చూపించడంలో దర్శకులు విజయం సాధించారు. కొన్ని సందర్భాలలో కొన్ని సన్నివేశాలు వేరే చిత్రాలకు పోల్చి ఉన్నప్పటికీ ఈ సినిమాలోని సందర్భాలకు తగ్గట్లు చాలా పర్ఫెక్ట్ గా అమర్చబడినట్లు ఉన్నాయి. ఈ విషయంలో ఎడిటర్ పనితీరు అర్థమవుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ ఇంకా లొకేషన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. సినిమాలో పాటలు సినిమాకు మరింత బోనస్ గా నిలిచాయి. నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇతర సాంకేతిక విషయాలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, పాటలు

మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు వేరే చిత్రాలను పోల్చి ఉండటం

సారాంశం :
ప్రస్తుత సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తూ యువత ఎటువంటి దుస్సాహసాలు చేయకుండా సామాజిక బాధ్యతతో సందేశాన్ని అందిస్తూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చిత్రం హుషార్ పిట్టలు.

Related Articles

Latest Articles